PM Kisan: పీఎం కిసాన్ డబ్బుల రాలేదా? అయితే ఇలా ఫిర్యాదు చేయండి..!! ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడద నిధులను బుధవారం విడుదల చేసింది కేంద్రం. అర్హులైన ఖాతాల్లో నగదు జమ చేసింది. మీకు డబ్బులు జమకానట్లయితే... [email protected]. లేదా [email protected] వెబ్‌సైట్ల ద్వారా తమ ఫిర్యాదు చేయవచ్చు. By Bhoomi 16 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ఏడాదికి రూ. 6వేల చొప్పున బ్యాంక్ అకౌంట్లో డబ్బును జమ చేస్తోంది. పీఎం కిసాన్ 15వ విడత డబ్బులను నవంబర్ 15వ తేదీ 2023రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 8కోట్ల మంది అర్హులైన రైతులకు ఇంకా పీఎం కిసాన్ సాయం బ్యాంకు అకౌంట్లో జమకాలేదని తెలుస్తోంది. కొందరికి బ్యాంకు సమస్యలతో ఆలస్యం అయినా...మరికొందరికి పలు కారణాలతో మొత్తానికే రాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. మరి పీఎం కిసాన్ డబ్బులు జమ కానట్లయితే ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ నగదు సాయం పొందేందుకు కొన్ని అర్హతలను విధించింది కేంద్రం. సన్నకారు రైతులకు మాత్రమే ఈ పెట్టుబడిసాయం ఇస్తున్నట్లు వెల్లడించింది. పీఎం కిసాన్ పథకంలో భాగంగా బ్యాంకు ఖాతాలో నగదు జమ కాని రైతులు ఇమెయిల్ లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు కేంద్రం అవకాశం ఇచ్చింది. ఎలాగో చూద్దాం. -బ్యాంకులో నగదు జమ కాని అర్హులైన రైతులు [email protected]. లేదా [email protected] వెబ్ సైట్ల ద్వారా తమ కంప్లైయింట్ నమోదు చేసుకోవచ్చు. -011-24300606 హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు రిజిస్టర్ చేయవచ్చు. -పీఎం కిసాన్ హెల్ప్ లైన్ 155261, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-115-526 ఫోన్ చేసి ఫిర్యాదు రిజిస్టర్ చేయాలి. - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నెంబర్ 0-23381092 లేదా 2338240 నెంబర్లకు కూడా కాల్ చేయవచ్చు. 15వ విడత స్టేటస్ ఈ విధంగా తెలుసుకోవచ్చు: -అర్హులైన రైతులు https://pmkisan.gov.in/ Portal అధికారిక పోర్టల్లోకి వెళ్లాలి. -హోం పేజీలో ఫార్మర్స్ కార్నర్ సెలక్ట్ చేసుకోవాలి. -పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్ చెక్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. -ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. -ఇప్పుడు డేటా పొందు ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరను ట్రై చేయండి #pm-kisan-samman-nidhi #pm-kisan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి