కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రూ.6వేలు అందిస్తుంది. ఈ డబ్బు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా ఇస్తారు. ఈసారి కూడా 17వ విడత విడుదలైంది. అయితే మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయినట్లయితే లేదా మీరు స్కీమ్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే ఈ వార్త మీ కోసమే..!
--> మీరు PM కిసాన్ యోజన లబ్ధిదారులైతే, మీరు ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి e-KYC, ల్యాండ్ వెరిఫికేషన్ లేదా మరేదైనా ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే హెల్ప్‌లైన్ నంబర్ 155261కి కాల్ చేయవచ్చు. ఏదైన సమస్య ఉన్న కూడా ఇదే నంబర్‌కు కాల్ చేయవచ్చు. ఈ నంబర్‌కు కాల్ చేసి కొత్త అప్లికేషన్ గురించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు.
--> కొన్ని కారణాల వల్ల మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయినా లేదా మీ దరఖాస్తు క్యాన్సిల్ అయినా లేదా స్కీమ్‌కు సంబంధించి ఏదైనా ఇతర సహాయం కావాలంటే, మీరు 1800115526 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
--> మీకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు 011-23381092 నంబర్‌కు కాల్ చేయవచ్చు. మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు.
--> పీఎం కిసాన్ యోజన కింద, రైతులకు సహాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లు లేదా టోల్ ఫ్రీ నంబర్లు మాత్రమే ఉన్నాయని అనుకోవద్దు. నిజానికి రైతులకు సహాయం చేయడానికి ఇమెయిల్ ID కూడా ఉంది. ఇక్కడ మీరు మీ సమస్యను వివరంగా చెప్పవచ్చు. ఆ తర్వాత మీకు సరైన సహాయం అందిస్తారు. దీని కోసం మీరు పథకం అధికారిక ఇమెయిల్ ID pmkisan-ict@gov.in కి ఇమెయిల్ చేయాలి.
Also Read: మోదీ గారూ సమాధానం చెప్పండి.. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్!