NEET Debate: మోదీ గారూ సమాధానం చెప్పండి.. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్‌!

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేయనుంది. పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చించేందుకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నీట్‌ వివాదంపై కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రధాని మోదీ ఏం సమాధానం చెబుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

New Update
NEET Debate: మోదీ గారూ సమాధానం చెప్పండి.. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్‌!

NEET Debate in Parliament: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన INDI బ్లాక్ లీడర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి ఫ్లోర్ లీడర్‌ల సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్‌లో చర్చల సమయంలో నీట్‌ పరీక్ష అవకతకవకాలకు నిరసనగా తమ నేతలంతా నల్ల బ్యాండ్‌లు ధరించాలని నిర్ణయించారు. నీట్ అంశంపై ఓ రోజంతా కేటాయించాలని INDI కూటమి పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

చర్చ జరగాల్సిందే:
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశంపై మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలకు మాట్లాడే సమయం ఇవ్వాలని INDI కూటమి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. పార్లమెంట్‌లో ఈ విషయంపై చర్చ జరగకపోతే లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు అన్యాయం చేసినట్టే అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది.


మరో ఇద్దరు అరెస్ట్:
మరోవైపు నీట్‌ పేపర్‌ లీక్ వ్యవహారంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ముందడుగు వేశారు. బీహార్‌ కేంద్రంగా నీట్‌ పేపర్ లీక్‌కు పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని గురువారం అరెస్టు చేశారు. పాట్నాకు చెందిన మనీష్ కుమార్, అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.


రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బీహార్‌, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. అయితే మనీష్ కుమార్‌ నీట్‌ పేపర్‌ను 12 మంది విద్యార్థులు, అంతకంటే ఎక్కువ మందికి ఇచ్చాడని సీబీఐ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరో నిందితుడు అశుతోష్.. లీకైన నీట్‌ పేపర్‌ చదువుకునేందుకు వీలుగా తన ఇంటిని, నిరూపయోగంగా ఉన్న ఓ స్కూల్‌ను వాడుకున్నట్లు సీబీఐ గుర్తించింది.

Also Read: ఇక చాలు.. పోయి బెంచ్‌పై కుర్చో.. ఇదేం ఐపీఎల్‌ కాదు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు