PM Kisan : రైతన్నలకు శుభవార్త...రేపే పీఎం కిసాన్ నిధులు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!

పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త. పీఎం కిసాన్ 16వ విడత నిధులు రేపు ( బుధవారం)విడుదల చేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని యావత్మాల్ జల్లా నుంచి ప్రధాని మోదీ 16వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.

PM Kisan Scheme : రైతులకు తీపికబురు..అకౌంట్లలోకి మరో రూ.2 వేలు.!
New Update

PM Kisan 16th Installment:  రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీం ద్వారా ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లోకి జమ అవుతుంది. అయితే ఈ నగదు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. అయితే ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.

కాగా కేంద్రం ఇప్పటివరకు 15విడతలుగా పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేసింది. పీఎం కిసాన్ 16వ విడత నిధులను ఫిబ్రవరి 28న రైతుల అకౌంట్లో జమ కానుంది. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాని మోదీ (PM Modi) ఈ నిధులను విడుదల చేస్తారు. పీఎం కిసాన్ నిధులు జమకావాలంటే అర్హులైన రైతులు ఎన్ పీసీఐ, ఆధార్ తో అనుసంధానించిన బ్యాంకు అకౌంట్  తోపాటు   ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. అర్హులైన రైతుల ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో పెట్టుబడి సాయం జమ అవుతుంది.

ఇలా చెక్ చేసుకోండి:

-పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ , ఇన్ స్టాల్ మెంట్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు https://pmkisan.gov.in/ పోర్టల్ ను తెరవండి.

-నో యువర్ స్టేటస్ పై క్లిక్ చేయండి.

-రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ను ఫిల్ చేయండి.

-గెట్ డేటా అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్క్రిన్ పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.

మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే:

-ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్ సైట్ ను తెరవండి.

-బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

-మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలన్నింటినీ నమోదు చేయండి.

-లబ్దిదారుల కోసం గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి.

-మీ గ్రామంలోని లబ్దిదారుల పేర్లన్నీ అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.

ఈ స్కీం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

-మీరు పీఎం కిసాన్ స్కీం (PM Kisan  Scheme) అర్హులైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

-ముందుగా మీరు pmkisan.gov.in వెబ్ సైట్ కు వెళ్లండి.

-న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

-తర్వాత క్యాప్చాను ఎంటర్ చేయండి.

-కావాల్సిన వివరాలను నమోదు చేసి క్లిక్ చేయండి.

-పీఎం కిసాన్ దరఖాస్తు ఫారమ్ ను నింపిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.

-భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త. 2వేలకు పైగా ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్..పూర్తివివరాలివే.!

#pm-modi #maharastra #pm-kisan #pm-kisan-16th-installment-date #kisan-scheme
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe