ISRO: గగన్‌యాన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని

గగన్‌యాన్‌లో పర్యటించే వ్యోమగాముల పేర్లను ప్రకటించారు భారత ప్రధాని మోదీ. భారతదేశం నుంచి మొదటిసారి మానవసహిత స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లాలు గగన్‌యాన్‌లో ప్రయాణం చేయనున్నారు.

New Update
ISRO: గగన్‌యాన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో భారీ ప్రయోగానికి సిద్ధం అవుతోంది. మానవసహిత రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా స్పేస్ క్రాఫ్ట్‌లో ప్రయాణించే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, సుభాన్షు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. వీరిని ఇస్రో ఎంపిక చేసింది. బెంగళూరు వ్యోమగామ కేంద్రంలో ఈ నలుగురూ శిక్ష పొందారు. ప్రధాని మోదీ స్వయంగా నలుగురు అస్ట్రోనాట్స్‌ను కలిసి అభినందనలు తెలిపారు.

గగన్‌యాన్‌కు ఎంపిక అయిన నలుగురు వ్యోమగాములు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన వారు. 2019 జూన్ లో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఇస్రో.. రష్యా అంతరిక్ష సంస్ధ రాస్ కాస్మోస్ అనుబంధ సంస్ధ అయిన గ్లావ్ కాస్మోస్ తో ఒప్పందం చేసుకుంది. తర్వాత నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2021 వరకు శిక్షణ పొందారు. ఇక గగన్‌యాన్‌కు వెళ్ళే ముందు నాసా కూడా ఈ నలుగురికి శిక్షణ ఇవ్వనుంది.

మొట్టమొదటి మానవసహిత స్పేస్ క్రాఫ్ట్..

భారతదేశం మొట్టమొదటిసారిగా మానవసహిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపనుంది. 2025లో ఇది నింగిలోకి ఎగియనుంది. గగన్ యాన్ ప్రాజెక్టులో నలుగురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి పంపించి తిరిగి భూమిపైకి తీసుకురానుంది ఇస్రో. ఈ ప్రయోగం మూడు రోజుల పాటు జరగనుంది. దీనికి సంబంధించి ఈ మధ్యనే ఇస్రో కీలక ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అనువైన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ ను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసామని చెప్పింది. మానవసహిత యాత్రకు వినియోగించే ఎల్వీఎం3 జీ1 కు వాడే ప్రమాణ పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు తెలిపింది. గగన్ యాన్ విజయవంతమైతే అంతరిక్షంలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు