Ravi Bishnoy: అఫ్గానిస్థాన్‌తో (IND Vs AFGN) మోహాలీ (Mohali) వేదికగా నేడు జరగబోయే తొలి టీ20 మ్యాచ్ పై టీమ్ ఇండియా ప్లేయర్ రవి బిష్ణోయ్ (Ravi Bishnoy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలికాలం మెహాలీ వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందని, ఎముకలు కొరికే చలిలో బౌలింగ్, ఫీల్డింగ్ చేయడం కఠినమైన సవాలుగా పేర్కొన్నాడు. అంతేకాదు రాత్రిపూట మంచు, తీవ్రమైన చలి కారణంగా ఇరుజట్లకు ఇబ్బందులు తప్పేలాలేవన్నాడు.
తీవ్రమైన మంచు, చలి..
ఈ మేరకు ఈసంవత్సరం టీ20 ప్రపంచకప్ ఆడబోయేముందు భారత్ ఆడబోయే చివరి టీ20 సిరీస్ ఇదే. అయితే మోహాలీ వేదికగా మొటి మ్యాచ్ జరగనుండగా.. ఇక్కడి వాతావరణం క్రికెటర్లకు సవాల్ విసురుతోంది. తీవ్రమైన చలితో ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. నెట్ ప్రాక్టీస్‌లోనూ భారత క్రికెటర్లు చలికోట్లు ధరించగా.. కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కూ కుళ్ల, స్వెటర్ లోనే హాజరయ్యాడు.
ఇది కూడా చదవండి : Shami: షమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు రెడీ!
బంతిపై కంట్రోల్ ఉండదు..
అయితే మొహాలీ వెదర్ పై సరదాగా మీడియాతో మాట్లాడిన రవి బిష్ణోయ్ (Ravi Bishnoy)..‘ఇక్కడి చలి వాతావరణంలో బౌలింగ్ ఓ పెను సవాల్. ఫీల్డింగ్ చేయడం కష్టమే. బాలుపై కంట్రోల్ ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఫీల్డింగ్ మరింత కఠినంగా మారనుంది. మేమే అన్నివిధాలుగా రెడీ అవుతున్నాం. బౌలింగ్‌లో వందశాతం మా ప్రణాళికలు అమలు చేస్తాం. టీ20ల్లో వైవిధ్యమైన బంతులను విసిరాలి. స్పిన్‌లోనూ కాస్త పేస్‌ను జోడిస్తే ఫలితాలు వస్తాయి. బంతిని ఎక్కువగా గాలిలో ఉంచేందుకు ప్రయత్నిస్తా. ఎర్ర బంతితోనే ఇలాగే ప్రాక్టీస్ చేశాను. అది ఈ ఫార్మాట్‌లో నాకు ఉపయోగపడుతుంది. కెప్టెన్‌కు మనమీద నమ్మకం ఉంచినప్పుడు ఒత్తిడి తట్టుకొని బౌలింగ్ చేయగలం. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తేనే మ్యాచ్‌లు గెలవగలం' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక చాలాకాలం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మతో (Rohit Sharma) టీ20 మ్యాచ్ ఆడనుండగా.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. రోహిత్ కు జోడీగా యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.