Cat Tips: ఈ మొక్కలు పెంచితే..ఇంట్లోకి పిల్లులు రావు..! ట్రై చేయండి!

ఇంట్లోకి తరచూ పిల్లులు రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. లావెండర్, పుదీనా, రోజ్మేరీ, జాడే,నిమ్మ గడ్డి వంటి మొక్కలు ఇంట్లో పెంచుకుంటే పిల్లులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

New Update
Cat Tips: ఈ మొక్కలు పెంచితే..ఇంట్లోకి పిల్లులు రావు..! ట్రై చేయండి!

Cat Tips: పిల్లిని కొందరు ఇళ్లలో ఎంతో ఇష్టంతో పెంచుకుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి పిల్లి మియావ్ .. మియావ్ అని అరుస్తూ తన యజమాని చుట్టు తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు.. పిల్లిని మనముందు నుంచి వెళ్లినా కొందరు ఇష్టపడరు. పొరపాటున పిల్లి కనబడిన కూడా కొందరు అశుభంగా భావిస్తారు.ఇంట్లోకి తరచూ పిల్లులు రావడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. పిల్లులు (cat) మళ్లీ మళ్లీ ఇంట్లోకి ప్రవేశిస్తాయా..? వాటికోసం కాపలా అవసరం లేదు. పిల్లులకు పాయిజన్ లాంటివి. పిల్లుల కోసం ఐదు విషపూరిత మొక్కలు (Poisonous plants) ఉన్నాయి. ఇది వీధి పిల్లులను ఇంటి నుంచి దూరంగా వెళ్లేలా చేస్తుంది. పిల్లులు ఎక్కువగా ఎలుకలు, పాలు వెతుకుతూ అవకాశం దొరికినప్పుడల్లా ఇంట్లో (house)కి వస్తాయి. కొన్నిసార్లు పిల్లులు ఇంట్లో చాలా చెత్త వేసి మనస్సును కలవరపెడుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లులు ఇంట్లోకి కానికూండా తలుపులు, కిటికీలు మూసి ఉంచడంతో పాటు అప్రమత్తంగా ఉండాలి. కానీ కొన్ని చర్యలతో.. పిల్లులను శాశ్వతంగా ఇంటి నుంచి దూరంగా ఉంచవచ్చు. పిల్లులు దగ్గకు రాకుండా కొన్ని మొక్కల గురించి ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఈ మొక్కలు పిల్లులని ఇంట్లో రాకుండా చేస్తుంది

  • లావెండర్ సువాసన పిల్లులకు అస్సలు నచ్చదు.దానివల్ల అవి దాని చుట్టూ తిరగవు.
  • పిల్లులు పుదీనా వాసన ఇష్టపడదు. మీ తోటలో పుదీనా నాటితే..పిల్లి మీకు దూరంగా ఉంటుంది.
  • కిటికీ, తలుపు దగ్గర రోజ్మేరీ మొక్కను ఉంచడం వల్ల పిల్లులు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఈ మొక్క పిల్లులకు కూడా విషపూరితమైనది.
  • పిల్లులను ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి..ఇంటి చుట్టూ నిమ్మ గడ్డిని నాటవచ్చు. దీనిలో వచ్చే వాసన పిల్లి తట్టుకోదు.
  • జాడే మొక్కకు కూడా పిల్లులు దూరంగా ఉంటాయి. ఎందుకంటే.. వాటి ఆకులను తింటే పిల్లులు అనారోగ్యానికి గురవుతాయి.

ఇది కూడా చదవండి: వీరి వీరి గుమ్మడి..దీనిలో పోషకాల ప్రత్యేకతే వేరండీ..!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఈ టిప్స్‌ పాటిస్తే సులభంగా డబ్బు సంపాదించవచ్చు

Advertisment
తాజా కథనాలు