Smart phone: కొత్త ఫోన్ కొనే ప్లాన్‎లో ఉన్నారా? రూ. 15వేలలో ఆకట్టుకునే ఫీచర్లతో ఈ మోడల్స్ ఓసారి చెక్ చేయండి.

కొత్త ఫోన్ కొనే ప్లాన్ లో ఉంటే రూ. 15వేలలో లభించే బడ్జెట్ ఫోన్లు అందుబాటులోఉన్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ , టెక్నో పోవా, రెడ్‌మీ, లావా బ్లేజ్ వంటి కంపెనీలు మార్కెట్లోకి స్పెషల్ ఫీచర్లతో లాంచ్ చేశాయి.

New Update
Upcoming Smartphones 2024 : త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ  టాప్ 5 స్మార్ట్ ఫోన్స్ పై ఓ లుక్కెయ్యండి.!

ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు పలు సెగ్మెంట్లకు చెందిన స్మార్ట్ ఫోన్లలో కామన్ ఫీచర్లతో వస్తున్నాయి. ముఖ్యంగా రూ. 15వేలలో లభించే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల స్పెసిఫికేషన్స్ సాధారణ అవసరాలకు సరిపోయేవిధంగా ఉంటున్నాయి. అయితే కొన్ని బ్రాండ్స్ మాత్రం ఏదొక స్పెషల్ ఫీచర్ను వీటిలో హైలెట్ గా అందిస్తూ ప్రమోట్ చేసుకుంటున్నాయి. అలాంటి ప్రత్యేక కలిగిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

1. శామ్‌సంగ్ గెలాక్సీ M14 5జీ:
శామ్‌సంగ్ గెలాక్సీ M14 5జీ ఫోన్ 6.6 అంగుళాల 90Hz IPS ఎస్సీడీ స్క్రీన్‌తో వస్తుంది. ఇది వీడియోలు చూడటానికి లేదా గేమ్స్ ఆడేందుకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫోన్ లో ఎక్సినోస్ 1330 చిప్ సెట్ కూడా ఉంటుంది. ఈ ప్రాసెసర్ రోజువారీ పనులను, మల్టీ టాస్కింగ్ లను సులభంగా చేస్తుంది. ఇందులో ఏకంగా 6000ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ ఉంటుంది. దీంతో స్మార్ట్ ఫోన్ పవర్ బ్యాకప్ విషయంలో కస్టమర్లకు ఎలాంటి ఆందోళణ అవసరం లేదు. ఇక ఇందులోని కెమెరాలు మంచి అవుట్ ఫుట్ ను అందిస్తాయి. ఈ ఫోన్ ధర రూ. 10, 499

2. టెక్నో పోవా 5ప్రో 5జీ :
టెక్నో పోవా 5ప్రో 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ తో మంచి పనితీరు అందిస్తుంది. ఇదిబ్రౌజింగ్, గేమింగ్, మల్టీ టాస్కింగ్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ డివైజ్ లో 68వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ బ్యాటరీ మంచి పవర్ బ్యాకప్ కూడా అందిస్తుంది. 128జీబీ, 256జీబీ స్టోరేజీ ఆప్షన్లలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 50మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాలు, 120హెచ్జడ్ రిఫ్రెష్ రేట్ తో 6.78 ఫుల్ హెడ్డీ డిస్ల్పే తోపాటు ఇతర స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 14,999.

3. రెడ్మీ 12 5జీ :
రెడ్మీ 12 5జీ ఈ ఫోన్ కేవలం రూ. 11,999తో అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఇదే తక్కువ ధరకు వస్తున్న స్మార్ట్ ఫోన్. రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఈ 5జీ ఫోన్ స్పీడ్, బ్యాటరీ, ఇతర స్పెసిఫికేషన్లు సరిపోతాయి. ఈ ఫోన్ 4 జెన్ 2 ప్రాసెసర్ , 6జీబీ వర్చువల్ ర్యామ్ తో కలిసి 12జీబీ ర్యామ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో 17.24 సెం.మీ ఫుల్ హెచ్డీ ప్లస్ 90హెచ్ జడ్ అడాప్టివ్ సింగ్ డిస్ల్పే, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్లతో 50 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయుఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో ఈ బడ్జెట్ ఫోన్ విడుదలయ్యింది. రెడ్మీ 125జీ 8 జీబీ, 256జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 15,499మాత్రమే.

4. లావా బ్లేజ్ ప్రో 5జీ :
లావా బ్రేజ్ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల 120 హెచ్ జడ్ ఎల్ సీడీ స్క్రీన్ తో వస్తుంది. సూపర్ ఫాస్ట్, పవర్ ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో ఈ ఫోన్ మంచి ఫర్మామెన్స్ అందిస్తుంది. 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000ఎంఏహెచ్ బ్యాటరీ డివైజ్ లోఉంటుంది. కెమెరా సెటప్ లో ఎల్ఈడీ ఫ్లాష్ తో 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలు ఈఐఎస్ సపోర్టతో 2కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తాయి. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 16జీబీ వరకు ఎక్స్ పాండబుల్ ర్యామ్ సపోర్ట్ ఫీచర్ తో వచ్చిన లావా బ్లేజ్ ప్రో 5జీ ధర రూ. 12,999.

ఇది కూడా చదవండి: నిత్యం వీటిని తీసుకుంటే చాలు..2 లీటర్ల కంటే ఎక్కువ రక్తం పడుతుంది..!!

Advertisment
తాజా కథనాలు