Flight Accident: కుప్పకూలిన విమానం...తెలియని ప్రయాణికుల జాడ!

థాయ్‌లాండ్‌ లో విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

New Update
Airlines : విమానంలో అలాంటి పని చేసినందుకు మహిళకు రూ.68 లక్షల జరిమానా!

Flight Accident: థాయ్‌లాండ్‌ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. థాయ్‌లాండ్‌ లోని చాచోంగ్‌సావోలోని అడవిలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బందితో వెళ్తున్న విమానం కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా...లేక ఇంకేమైనా జరిగిందా అనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు.

విమానం బ్యాంకాక్ విమానాశ్రయం నుంచి ట్రాట్ ప్రావిన్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. థాయ్‌లాండ్‌లోని తూర్పు ప్రావిన్స్‌లోని చాచోంగ్‌సావోలో గురువారం టూరిస్టులతో విమానం బయల్దేరింది. కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్లు సమాచారం అందడంతో రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. పర్యాటకులు జాడ కోసం వెతుకుతున్నట్లు స్థానిక మీడియా వివరించింది.

Cessna Caravan C208 విమానం. థాయ్ ఫ్లయింగ్ సర్వీస్ ఫ్లైట్ నంబర్ TFT 209. బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌తో గాలిలోకి లేచిన కొద్ది సేపటికే సంబంధాన్ని కోల్పోయింది. విమానం ఆగ్నేయ ట్రాట్ ప్రావిన్స్‌కు వెళుతుండగా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:18 గంటలకు కూలిపోయింది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని అధికారులు వివరించారు.

Also Read: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు… ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు