Plane Crash : కూప్పకూలిన విమానం.. ఆరుగురు దుర్మరణం!

నార్త్‌వెస్ట్రన్ ఎయిర్ లీజ్‌కు రిజిస్టర్ చేసి ఉన్న ఒక చిన్న విమానం మంగళవారం కెనడాలోని రిమోట్ నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లోని ఫోర్త్ స్మిత్ సమీపంలో క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది.

Plane Crash : కూప్పకూలిన విమానం.. ఆరుగురు దుర్మరణం!
New Update

Plane Crash in Canada : కెనడా(Canada) లోని ఉత్తరాన ఉన్న రిమోట్ గనికి కార్మికులను తీసుకువెళుతున్న చిన్న ప్రయాణీకుల విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నార్త్‌వెస్టర్న్ ఎయిర్ నిర్వహిస్తున్న జెట్‌స్ట్రీమ్ ట్విన్ టర్బోప్రాప్ ఎయిర్‌లైనర్ ఫోర్ట్ స్మిత్‌లోని రన్‌వే(Runway) చివరి నుంచి కేవలం 1.1 కిలోమీటర్లు దూరంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఓ వ్యక్తి బయటపడినట్టుగా తెలుస్తోంది.

దురదృష్టం.. విషాదం:

నార్త్ వెస్ట్రన్ ఎయిర్(North Western Air) ఈ ఘటనపై స్పందించింది. దురదృష్టకరమైన ఘటనగా చెప్పుకొచ్చింది. విమానం కార్మికులను గనిలోకి తీసుకువెళుతున్న చార్టర్ అని తెలిపింది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో ఫోర్ట్ స్మిత్(Fort Smith) నుంచి బయలుదేరే అన్ని విమానాలను రేపటి(జనవరి 25) వరకు నిలిచిపోయాయి. ప్రమాదాన్ని పరిశీలించేందుకు కెనడా రవాణా భద్రతా బోర్డు ఒక బృందాన్ని నియమించింది.

జెట్‌స్ట్రీమ్ ఎయిర్‌క్రాఫ్ట్‌(Jetstream Aircraft) కు సంబంధించిన ప్రమాదాన్ని పరిశీలించడానికి పరిశోధకుల బృందాన్ని మోహరించారు, కెనడా రవాణా భద్రతా బోర్డు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. బ్రిటిష్ కొలంబియాలో హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఒక రోజు తర్వాత ఈ ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది.

Also ReaD: దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఘనత.. 43ఏళ్ల వయసులో బోపన్న సంచలనం!

WATCH:

#canada #airlines #plane-crash-in-canada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe