Pithapuram SVSN Varma : జనసేన(Janasena) అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిఠాపురం(Pithapuram) నుంచి పోటీ చేయబోతున్నట్టు స్వయంగా ఆయనే ప్రకటించారు. దీంతో, పిఠాపురం టీడీపీ(TDP) లో అసమ్మతి సెగ రగులుతోంది. పవన్ పోటీ చేస్తాననడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేస్తోన్నారు. వర్మకు టికెట్ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేశారు. వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు.
Also Read : పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే!
అయితే, తాజాగా ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ(SVSN Varma) స్పందించారు. ఇది అన్యాయం అంటూ అని ఆక్రోశించారు. ఇప్పటివరకు పిఠాపురం ప్రజల కష్టాల్లో భాగం అయ్యానని.. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. ఇన్ని చేసిన తనకు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీరని అన్యాయం చేశారని వాపోయారు. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయమని ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
పిఠాపురం టీడీపీ సీటు తనదేనని ఇప్పటివరకు ధీమాగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నేడు పవన్ ప్రకటనతో షాక్ అయ్యారు. పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో పవన్‌పై రెబల్‌గా పోటీకి సిద్ధమైయ్యారు మాజీ ఎమ్మెల్యే వర్మ. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానంటున్నారు. ఇన్నాళ్లు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్న వర్మ టికెట్ తనదేనని ధీమాలో ఉన్నారు. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ నుంచి చంద్రబాబు, లోకేష్ బొమ్మలను తొలగించారు. పిఠాపురం నుంచి పవన్ పోటీపై వర్మ వర్గీయులు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.