Vanga Geeta vs Pawan: అతను కాపే కావొచ్చు.. 'తోపు కాదు..' పవన్‌పై గీతా పంచులు! పిఠాపురంలో ఎవరూ తోపు కాదన్నారు వైసీపీ ఎంపీ వంగ గీతా. పిఠాపురం కాపుల ఆడబడుచుని.. కాపులంతా తనతోనే ఉన్నారన్నారు. పవన్‌కు రాజకీయ అవగాహన లేదన్నారు. తనను జనసేనలోకి ఆహ్వానించడమేంటో అర్థంకాలేదన్నారు. తాను కూడా పవన్‌ని వైసీపీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందా అని ప్రశ్నించారు. By Trinath 23 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గానిదే బర్నింగ్ టాపిక్. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గం మరొక ఎత్తుగా కనిపిస్తోంది. ఇక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటి చేస్తుండడమే ప్రధాన కారణం. పవన్‌పై పోటిగా వైసీపీ నుంచి ఎంపీ వంగా గీతా బరిలోకి దిగుతున్నారు. దీంతో టగ్ ఆఫ్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. నువ్వా నేనా అన్నట్టు జరగనున్న ఈ పోటిలో ఇప్పటికే మాటల యుద్ధం మొదలైంది. పవన్ కాపు అయితే.. తాను కాపేనంటున్నారు వంగా గీతా. పిఠాపురం టిక్కెట్ తనకు కేటాయించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పిఠాపురం ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి జగన్ తనకు ఇవ్వడం ఆనందాన్ని కలిగించిందన్నారు గీతా. పిఠాపురం ప్రజలకు తనకు ఎప్పటినుంచో అనుబంధం ముడిపడి ఉంది. కాపుల ఆడబడుచును నేను: ఎవరూ పిఠాపురంలో తోపు కాదన్నారు వంగ గీతా. పిఠాపురం కాపుల ఆడబడుచుని.. కాపులంతా తనతోనే ఉన్నారన్నారు. తనను జనసేనలోకి పవన్ ఆహ్వానించడాన్ని తప్పుబట్టారు గీతా. తాను కూడా వైసీపీలోకి ఆహ్వానిస్తున్నానని .. జగన్ అన్ని విధాల సహకరిస్తారని అంటే బాగుంటుందా అని కౌంటర్ వేశారు. ఇక ఎన్నికల వరకు ప్రజలను ఓటర్లుగా చూడడం.. నెగ్గిన తర్వాత.. నాయకులు తన సొంత పనులు చూసుకోవడం లాంటివి గతంలో జరిగేవన్నారు గీతా. జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే నమ్మకం, నాయకులంటే గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్రమంతా జగన్‌పై ఎలాంటి నమ్మకం ఉందో పిఠాపురంలో కూడా వంగా గీత పై కూడా అదే నమ్మకం ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబంలో మనిషిగా తనను చూస్తారని తెలిపారు. ప్రజల్లో ఉంటానని.. ఏ పనికైనా ప్రజలు ఫోన్ చేసి అడుగుతారన్నారు. తాను ఏ పనైనా చేస్తాననే భరోసా పిఠాపురం ప్రజల్లో ఏర్పడిందని చెప్పారు వంగా గీతా. పవన్ కొత్త.. నేను కొత్త కాదు: పవన్‌ని కాపులు ఒక్కరే గుర్తిస్తారెమో... నియోజకవర్గంలో కాపులతో పాటు అన్ని కూలాలవారు తనను గుర్తిస్తారన్నారు గీత. పవన్ కళ్యాణ్ పిఠాపురానికీ కొత్త అని.. తాను కొత్త కాదన్నారు గీత. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్ గారు బొట్టుపెట్టి పిఠాపురం సీటు ఇచ్చారని.. అప్పుడే పిఠాపురం అంటే వంగా గీత విశ్వనాథ్ అనే ఒక మార్కు ఏర్పడిందని తెలిపారు. ఎప్పటినుంచో తాను ఒక స్టూడెంట్ లీడర్ గా ఉంటూ ఎన్నో పదవులు చేశానన్నారు. 2009లో ప్రజారాజ్యంలో ఒక చెల్లిగా భావించి చిరంజీవి గారు తనకు సీట్ ఇచ్చారన్నారు. ఇవన్నీ తెలియకుండా రాజకీయ అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని తనకు అనిపిస్తుందని విమర్శించారు గీతా. పవన్ కళ్యాణ్ కులాలను లెక్కపెట్టుకుని.. నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చని.. ఆయన కాపు అయితే తాను కూడా కాపునేన్నారు గీత. తాను ఒక కాపు నాయకురాలిగా.. కాపుల ఆడపడుచుగా తనకు గుర్తింపు ఉందన్నారు. Also Read: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు… రిటైర్డ్ ఐపీఎస్ తో పాటు, ఓ మీడియా ఛానెల్ అధినేత కూడా! #pawan-kalyan #ap-politics-2024 #vanga-geeta మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి