Pithapuram: పీక్ స్టేజీకి చేరిన అభిమానం.. ఫలితాలు రాకముందే పిఠాపురంలో హడావుడి.!
పిఠాపురంలో కారు, బైకులపై స్టిక్కర్లు చర్చనీయాంశంగా మారాయి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పవన్ అభిమానులు, డిప్యూటీ సీఎం వంగాగీత అని వైసీపీ అభిమానులు తమ వాహనాలకు స్టిక్కర్లు అతికించుకున్నారు. అంతేకాకుండా, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే దానిపై కోట్లలో బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.