Pilot: నిద్ర రాకుండా పైలట్‌లు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!

పైలట్ లు విధుల్లో ఉన్నప్పుడు నిద్రరాకుండా ఉండేందుకు ఓ ఔషదాన్ని తీసుకుంటారట. 'మెథాంఫేటమిన్' అనే మాత్రలు నిద్రలేమి, అలసటను దూరం చేస్తాయని వైద్య నిపుణులు వెల్లడించారు. మెదడు, శరీరం మధ్య ప్రక్రియను వేగవంతం చేస్తూ.. సుదీర్ఘ మిషన్‌ల సమయంలో చురుగ్గా ఉంచుతాయని చెబుతున్నారు.

author-image
By srinivas
Pilot: నిద్ర రాకుండా పైలట్‌లు ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు!
New Update

Pilot: పైలట్‌లు చాలా బిజీ షెడ్యూల్‌లను కలిగి ఉంటారు. ప్రతి పైలట్ రెండు షిఫ్ట్‌ల మధ్య కనీసం 10 గంటల విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఈ సమయంలోనే ఒక పైలట్ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలని, ప్రతి వారం సగటున 30 గంటల తప్పనిసరి విశ్రాంతి పొందాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం ఇండోనేషియా విమానంలో పైలట్‌లు ఇద్దరూ నిద్రిస్తున్నట్లు గుర్తించిన ప్రపంచవ్యాప్త విమానయాన సంస్థలు ఒక ఆశ్చర్యకరమైన పరిష్కారం కనుగొన్నారు. పైలట్ ల నిద్రలేమికి ఔషధం కనుగొన్నారు.

యాంఫేటమిన్‌ మందులు..
ఈ మేరకు వైద్య నిపుణులు 'మెథాంఫేటమిన్' (methamphetamine) అనే మాత్రలను అందుబాటులోకి తెచ్చారు. పైలట్‌లు నిద్రలేమి, అలసటను దూరం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇది సుదీర్ఘ మిషన్‌ల సమయంలో పైలట్‌లను చురుగ్గా ఉంచుతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ కార్యాచరణను పెంచుతాయి. ఇది మెదడు, శరీరం మధ్య సందేశాల ప్రసారాన్ని వేగవంతం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇవి ఇప్పటికే విస్తృతంగా అందుబాటులో ఉండగా.. సింగపూర్, ఇండియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో భారీగా ఉపయోగిస్తున్నారు. అయితే 'మెథాంఫేటమిన్' ను నిరంతరం తీసుకోవడం వల్ల వ్యసనానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Scary bird: ఇదే అత్యంత భయానక పక్షి.. మనుషులను చూస్తే అంతే!

ప్రాణాంతకంగా మారుతుంది..
'విమానం ఆకాశంలోకి వెళ్లినప్పుడు ఫైటర్ పైలట్‌లు తమ పరిసరాలను గమనించి ఎలా స్పందించాలో నిర్ణయించుకోవడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆకలి, అలసట వారికి ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి సమయంలో ఈ మందులు ఎంతో మేలు చేస్తాయి' అని సైనిక నిపుణులు వెల్లడించారు.

#pilots #methamphetamine #prevent-sleep
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe