Harish Salve: ముచ్చటగా మూడోసారి హరీష్ సాల్వే పెళ్లి.. పార్టీలో మెరిసిన ఐపీఎల్ క్రియేటర్! భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే త్రినాను వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు నీతా అంబానీ, లలిత్ మోదీ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. సాల్వేకి ఇది మూడో పెళ్లి. సాల్వే మరియు అతని మొదటి భార్య మీనాక్షి 38 సంవత్సరాల వివాహం తర్వాత జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు. By Trinath 04 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Harish Salve gets married in London, Nita Ambani, Lalit Modi among guests: భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే లండన్‌లో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో త్రినా(Trina)ను వివాహం చేసుకున్నారు. ఒక వీడియోలో, హరీష్ సాల్వే(Harish salve) తన భార్య త్రినాతో నిలబడి ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకోవడం కూడా కనిపించింది. నీతా అంబానీ(nita ambani), ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ(Lalit modi), ఉజ్వల రౌత్(ujwala rout) సహా పలువురు ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లలిత్ మోదీ, అతని ప్రియురాలు మోడల్ ఉజ్వల రౌత్ కూడా ఫోటోలకు పోజులిచ్చారు. సాల్వేకి ఇది మూడో పెళ్లి. సాల్వే మరియు అతని మొదటి భార్య మీనాక్షి 38 సంవత్సరాల వివాహం తర్వాత జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు. అదే సంవత్సరంలో అతను కరోలిన్ బ్రోస్సార్డ్‌ని వివాహం చేసుకున్నాడు. సాల్వే- అతని మాజీ భార్య మీనాక్షికి సాక్షి, సానియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. త్రినాతో హరీష్ సాల్వే హరీష్ సాల్వే వివాహ వేడుకలో ప్రముఖులు హరీష్ సాల్వే, త్రినా, ఉజ్వల రౌత్ వివాహ వేడుకలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, అతని ప్రియురాలు మోడల్ ఉజ్వల రౌత్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న 68 ఏళ్ల న్యాయవాది, గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్‌తో సహా కొన్ని ఉన్నతమైన కేసుల్లో భాగం. కులభూషణ్ జాదవ్‌ను సమర్థించినందుకు సాల్వే కేవలం ఒక్క రూపాయి వసూలు చేశారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ వివాదం, సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు వంటి ఇతర ముఖ్యమైన కేసులకు ఆయన లాయర్. నవంబర్ 1999 నుండి నవంబర్ 2002 వరకు భారతదేశ సొలిసిటర్ జనరల్‌గా పనిచేసిన సాల్వే జనవరిలో వేల్స్ అండ్ ఇంగ్లండ్ కోర్టులకు క్వీన్స్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. HOW CUTE !! Fugitive Lalit Modi attends wedding of former Solicitor General of India, Harish Salve. Lalit Modi, the founder and ex-chairman of the highly lucrative Indian Premier League (IPL), is wanted by Indian law enforcement agencies on cases of financial irregularities… pic.twitter.com/No87zumvIF — Mahua Moitra Fans (@MahuaMoitraFans) September 4, 2023 ALSO READ: గుడ్‌న్యూస్ చెప్పిన బుమ్రా.. తండ్రైన యార్కర్ కింగ్..పిల్లాడి పేరు తెలుసా? #lalit-modi #harish-salve #harish-salve-marries-for-3rd-time #harish-salve-3rd-marriage #trina మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి