Hamas: ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు..దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!

ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఓ మహిళను నగ్నం ఊరేగిస్తూ గాజా వరకు తీసుకెళ్లింది. ఈ ఫోటో ఇప్పుడు ఫోటో అఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీనిపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నగ్న ఫొటోకు అవార్డు ఇవ్వడం పైశాచిక ఆనందం అంటూ ఫైర్ అవుతున్నారు.

Hamas: ఓ మహిళను నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు..దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..!
New Update

Hamas:  మహిళలపై అక్రుత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ ఫొటోను ఉత్తమ ఫోటో అవార్డు రావడం తీవ్ర దుమారం రేపింది ఆ ఫొటోకు ప్రథమ బహుమతి ఇవ్వడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకువచ్చి నరమేధానికి పాల్పడిన సంగత తెలిసిందే. కొందరు పౌరులను కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లారు. ఆ సమయంలో జర్మనీ టూరిస్టు షానీ లౌక్ ను బంధించి నగ్నంగా వీధుల్లో ఊరేగించి పైశాచిక ఆనందం పొందారు. అప్పట్లో ఈ వార్త యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. తాజాగా ఆ ఫోటోకు ఓ కాంపిటేషన్లో బెట్ ఫొటో అవార్డు దక్కడం గమనార్హం.

పూర్తి వివరాలు ఇవే:
అమెరికాకు చెందిన డొనాల్డ్ డబ్ల్యూ రెనాల్డ్స్ జర్నలిజం ఇన్ స్టిట్యూట్ లో పలు కేటగిరీల్లో పిక్చర్స్ ఆఫ్ ఇయర్ ఇంటర్నేషన్ అవార్డులను ప్రకటించింది. దీలో ఓ ఫొటోకు గాను అసోసియేటెడ్ ప్రెస్ కు మొదటి బహుమతి లభించింది. అదే షానీ లౌక్ ను హమాస్ మిలిటెంట్లు నగ్నం ఊరేగించిన ఫొటో. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ దారుణాన్ని ఉత్తమ ఫొటోగా ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోను అవార్డు ఆర్గనైజర్లను మొదట బ్లర్ చేయకుండానే ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో దాన్ని డిలీట్ చేశారు.

2023 అక్టోబర్ 27న ఇజ్రాయెల్ లో సూపర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. గాజా సరిహద్దుకు సమీపంలో హమాస్ జరిపిన నరమేధంతో ఫెస్టివల్ జరిగిన ప్రాంతంలోనే 260 మంది అమాయకులు ప్రాణాలో కోల్పోయారు. అక్కడి నుంచి కొందరిని బంధీలుగా తీసుకెళ్లారు. వారిలో షానీ లౌక్ కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రతిదాడుల్లో భాగంగా గాజా భూభాగంలోకి ఐడీఎఫ్ దళాలుు ప్రవేశించి షానీ డెడ్ బాడీని గుర్తించాయి. ఆమెను తీవ్రంగా వేధించారని..గాజా మొత్తం ఊరేగించారని అప్పట్లో ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి :  ఐఫోన్ 15 ప్రో మోడల్ పై బంపర్ డిస్కౌంట్..ఏకంగా రూ. 56,000..!

#israel-hamas-war #shani-lauk #hamas-attack
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe