Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది 

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడేవారందరికీ గూగుల్ ప్లే స్టోర్ గురించి తెలిసిందే. ఏ యాప్ కావాలన్నా ఇక్కడ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’ తీసుకువచ్చింది. దీనితో గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ ప్రారంభం అయిందని చెప్పవచ్చు. 

Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది 
New Update

PhonePe launches Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ గుత్తాధిపత్యానికి తెరపడనుంది. అది కూడా మన భారత్ కంపెనీ తీసుకొచ్చిన కొత్త ప్లే స్టోర్ తో కావడం గమనార్హం. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్ లోడ్ తీసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ యాప్ గా అందరికీ బాగా తెలిసిన ఫోన్ పే (Phonepe) కంపెనీ..  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం 'ఇండస్ యాప్‌స్టోర్'ని ప్రారంభించింది. యాప్ అబౌట్ అస్ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం, ఇండస్ యాప్‌స్టోర్‌లో(Indus Appstore) దాదాపు 4 లక్షల యాప్‌లు ఉన్నాయి.  వీటిని 12 భారతీయ భాషల్లో సెర్చ్ చేయవచ్చు. అలాగే వాటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ యాప్ మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని అందించడానికి ఇండస్ యాప్‌స్టోర్ ప్రారంభిస్తోందని PhonePe CEO, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ (Sameer Nigam) తెలిపారు. ఇది మరింత ప్రజాస్వామ్య-శక్తివంతమైన భారతీయ డిజిటల్ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. 

PhonePe సెప్టెంబర్ 2023లో డెవలపర్‌లను ఆహ్వానించింది.. 
ఈ ప్లే స్టోర్  ద్వారా ఫోన్ పే కంపెనీ Android యాప్ పంపిణీలో Google గుత్తాధిపత్యాన్ని సవాలు చేయాలనుకుంటోంది. సెప్టెంబర్ 2023లో తమ యాప్‌లను లిస్ట్  చేయమని కంపెనీ ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్‌లను ఆహ్వానించింది. యాప్ డెవలపర్‌లను ఆహ్వానిస్తున్నప్పుడు, 1 సంవత్సరం పాటు యాప్ లిస్టింగ్‌కు ఎటువంటి ఛార్జీ ఉండదని చెప్పింది.  Indus డెవలపర్ ప్లాట్‌ఫారమ్‌లో యాప్ లిస్టింగ్ మొదటి సంవత్సరం ఉచితం అని PhonePe తెలిపింది. దీని తర్వాత ప్రతి సంవత్సరం నామమాత్రపు ఛార్జి మాత్రమే ఉంటుందని ప్రకటించింది. అయితే, ఒక సంవత్సరం తర్వాత డెవలపర్ నుండి ఎంత యాన్యువల్ ఛార్జీ వసూలు చేస్తుందో కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

Also Read: చరిత్రలో అంబానీని మించిన ధనవంతుడు.. బ్రిటీషోళ్లకే అప్పు ఇచ్చిన ఘనుడు.. ఎవరంటే.. 

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్.. 
యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ data.ai ప్రకారం, భారతీయులు  2023లో మొబైల్ యాప్‌ల కోసం దాదాపు 1.19 ట్రిలియన్ గంటలు గడిపారు. ఇది 2021లో 954 బిలియన్ గంటలు కావడం గమనార్హం. యాప్ డౌన్‌లోడ్‌ల పరంగా కూడా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 1 బిలియన్‌కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, ఇండస్ యాప్‌స్టోర్ (Indus Appstore)సహ వ్యవస్థాపకుడు ఆకాష్ డోంగ్రే సెప్టెంబర్‌లో యాప్ గురించి వివరిస్తూ  'భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2026 నాటికి  1 బిలియన్ కంటే ఎక్కువ చేరుతుందని అంచనా ఉందని చెప్పారు.  ఈ వినియోగదారుల చేరిక తమకు లోకలైజ్డ్  Android యాప్ స్టోర్‌ని సృష్టించడానికి పెద్ద అవకాశాన్ని ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

ఇంత పెద్ద కస్టమర్ మార్కెట్ ఉన్నప్పటికీ, యాప్ డెవలపర్‌లు ఇంతవరకూ ఎప్పుడూ ఒకరితో మాత్రమే పని చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఇండస్ ప్లే స్టోర్ తో యాప్ డెవలపర్లకు మరో ఆప్షన్ దొరుకుతోంది.  

Watch this Interesting Video:

#indus-app-store #phonepe #android-phone
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి