Indus Appstore: గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే దేశీయ ప్లే స్టోర్
మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది.