PhonePe launches Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ గుత్తాధిపత్యానికి తెరపడనుంది. అది కూడా మన భారత్ కంపెనీ తీసుకొచ్చిన కొత్త ప్లే స్టోర్ తో కావడం గమనార్హం. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్ లోడ్ తీసుకునే వీలుండేది. అయితే ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ యాప్ గా అందరికీ బాగా తెలిసిన ఫోన్ పే (Phonepe) కంపెనీ.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం ‘ఇండస్ యాప్‌స్టోర్’ని ప్రారంభించింది. యాప్ అబౌట్ అస్ వెబ్ సైట్ అందించిన వివరాల ప్రకారం, ఇండస్ యాప్‌స్టోర్‌లో(Indus Appstore) దాదాపు 4 లక్షల యాప్‌లు ఉన్నాయి. వీటిని 12 భారతీయ భాషల్లో సెర్చ్ చేయవచ్చు. అలాగే వాటిని డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ యాప్ మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని అందించడానికి ఇండస్ యాప్‌స్టోర్ ప్రారంభిస్తోందని PhonePe CEO, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ (Sameer Nigam) తెలిపారు. ఇది మరింత ప్రజాస్వామ్య-శక్తివంతమైన భారతీయ డిజిటల్ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..Indus Appstore: గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ.. ఫోన్ పే ఇండస్ యాప్ స్టోర్ వచ్చేసింది
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడేవారందరికీ గూగుల్ ప్లే స్టోర్ గురించి తెలిసిందే. ఏ యాప్ కావాలన్నా ఇక్కడ నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోన్ పే ‘ఇండస్ యాప్ స్టోర్’ తీసుకువచ్చింది. దీనితో గూగుల్ ప్లే స్టోర్ కి పోటీ ప్రారంభం అయిందని చెప్పవచ్చు.
Translate this News: