/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/PhD-admissions-controversy-in-Kakatiya-Injuries-student-union-leaders-jpg.webp)
వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం హింసకు దారితీసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల కింద పీహెచ్‌డీ కేటగిరి-2 అడ్మిషన్లు చేపట్టింది విశ్వవిద్యాలయం. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదంతో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అర్హులైన వారికి మాత్రమే అడ్మిషన్లు దక్కేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వీసీ కార్యాలయం ముందుకు వచ్చి అక్రమాలను నిగ్గు తేల్చాలని, ర్యాలీగా వచ్చిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో మంగళవారం పీహెచ్‌డీ అడ్మిషన్లపై నిలదీసిన వివిధ విద్యార్థి సంఘాల నేతలు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు వారీపై లాఠీలతో పని చెప్పిన సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సంఘటనలో రాంబాబు, అంబాల కిరణ్, శంకర్, నాగరాజు, ప్రశాంత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు డాక్టర్లు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి సంఘాల నాయకులు ముందుండి పోరాడిన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం అధికారులను ప్రశ్నిస్తే పోలీసులను ఉసిగొల్పి కాకతీయ యూనివర్సిటీ వీసీ విద్యార్థుల గొంతు నొక్కాలని చూడడం సిగ్గుచేటు అని ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి నాయకులు విమర్శిస్తున్నారు. వీసీ వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్ని అరాచకాల మీద విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. అరాచకంగా పోలీసులను ఉసిగొల్పి కాళ్లు చేతులు విరిగేలా కొట్టించాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి తొత్తుగా మారిన వీసీ ఉద్యమాలను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నాడని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. నిన్న పోలీసుల చేతుల్లో గాయపడిన విద్యార్థి సంఘాల నాయకులను వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల పరామర్శించారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆందోళన చేసిన విద్యార్థులు వీసీ ఛాంబర్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఉపకులపతి రమేష్, రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో విద్యార్తులు వాగ్వాదానికి దిగారు. అడ్మిషన్లను వీసీ, రిజిస్ట్రార్, అన్ని విభాగాల డీన్స్ అమ్ముకున్నారని విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సర్దిచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య మాటామాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది.