Petrol Price: ఈ ఏడాది చివరికి వచ్చేశాం. కొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మనం మనం ఎదో గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకోవడం.. కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడం మామూలే. కానీ, ఈ కొత్త సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అవును.. అందరూ ఎప్పుడూ కోరుకునే.. అందరికీ అత్యవసరం అయ్యే అదిరిపోయే వార్తా న్యూ యియర్ సందర్భంగా ప్రధాని ఇవ్వబోతున్నారట. అదేమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మారేందుకు ఆలస్యం పూర్తిగా చదివేయండి.
వచ్చే ఏడాది ప్రారంభంలో ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. నూతన సంవత్సరానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశప్రజలకు భారీ కానుకను అందించనున్నారు. అవును, విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం, పెట్రోల్ - డీజిల్ ధరలలో(Petrol Price) భారీ తగ్గింపు ఉండబోతోంది. 2024 ప్రథమార్థంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ తగ్గింపు అందుబాటులోకి రాబోతోనందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుతున్న వార్తలను పరిగణనలోకి తీసుకుంటే, పెట్రోల్ - డీజిల్ రేట్లు 6 నుంచి 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది.దీనికి సంబంధించి చమురు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
ధరలు చాలా తగ్గొచ్చు..
మీడియా కథనాల ప్రకారం, ఇప్పుడు పెట్రోలియం మంత్రిత్వ శాఖ - ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య పెట్రోల్ - డీజిల్ ధరల(Petrol Price)ను తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. దీంతోపాటు చమురు కంపెనీలతోనూ చర్చలు జరుపుతున్నారు. అంతా సవ్యంగా సాగితే పెట్రోల్, డీజిల్ ధరలు 6 నుంచి 10 రూపాయల వరకు తగ్గుతాయి.
Also Read: షేర్లు.. బంగారం.. FDల వడ్డీలు.. దూసుకుపోతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెటర్?
గతేడాది మే నుంచి ఇప్పటి వరకు..
గత ఏడాది మే 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధర(Petrol Price)ల్లో ఎలాంటి మార్పు లేదు. పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. గత సారి కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించింది. ఈ కాలంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.13, రూ.16 తగ్గింది.
పెట్రోల్ ధర తగ్గడానికి అవకాశం వచ్చిందిలా..
Petrol Price: నిజానికి దిగుమతి చేసుకున్న ముడి చమురు కొనుగోలు ధరలో ఇటీవల కొన్ని నెలలుగా భారీగా తగ్గుదల చోటుచేసుకుందని పెట్రోలు మంత్రిత్వ శాఖ వాదిస్తోంది. ఈ ముడి చమురును పెట్రోల్ - డీజిల్ తయారు చేయడానికి రిఫైనరీకి పంపిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-మార్చి) ఇప్పటివరకు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున $77.14గా ఉన్నాయి. కేవలం రెండు నెలల్లో అంటే, సెప్టెంబర్‌లో $93.54 - అక్టోబర్‌లో $90.08 మాత్రమే పెరిగింది. గత ఏడాది అంటే . 2022-23లో ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు $ 93.15గా ఉంది. అంటే గతేడాదికి.. ఈ ఏడాదికి ముడిచమురు ధర బ్యారెల్ కి సగటున దాదాపు $16 డాలర్లు తగ్గింది. అందుకే, పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం కలిగింది. నిజానికి చాలా నెలలుగా పెట్రోల్ ధరలు తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరిలో పెట్రోల్ ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Watch this interesting Video: