Nara Lokesh:ఏసీబీ కోర్టులో లోకేష్‌ పై సీఐడీ మోమో!

లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సీఐడీ అధికారులు. యువగళం యాత్ర ముగింపు సమయంలో పలు ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.

Lokesh: నారా లోకేష్ ఫోన్ హ్యాక్!.. ఈసీకి ఫిర్యాదు
New Update

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) పై విజయవాడ ఏసీబీ కోర్టులో(ACB Court) సీఐడీ (CID) మెమో దాఖలు చేసింది. లోకేష్‌ సీఐడీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రూఫ్స్‌తో సహా ఏసీబీ కోర్టుకు (ACB Court)  సమర్పించారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానెళ్ల కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో లోకేష్‌ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు సీఐడీ ఆరోపణలు చేస్తుంది.

కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా లోకేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపించింది. చంద్రబాబు పై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్‌ విధించడం తప్పని లోకేష్‌ ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్‌ వ్యాఖ్యాలున్నాయని సీఐడీ మెమోలో పేర్కొన్నారు.

స్కిల్, అమరావతి ఐఆర్‌ఆర్‌, ఫైబర్‌ నెట్‌ స్కామ్‌ కేసులలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని, తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని టీడీపీ హయాంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీపీఆర్‌ కింద వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు.

వాటిని లోకేష్‌ తప్పుపడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ పేర్కొంది. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని..రెడ్‌ బుక్‌ లో పేర్లు రికార్డు చేశానని..తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్‌ హెచ్చరించారని సీఐడీ పేర్కొంది. 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగం అంటున్నారు.

దీన్ని కూడా లోకేష్ తప్పుబట్టడ సరికాదంటున్నారు. సాక్షులని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా ఉందని సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్‌కి జారీ చేసిన 41ఏ నోటీసులలో పేర్కొన్న షరతులకి విరుద్దమంటోంది సీఐడీ.

Also read: పవన్‌ కి హరిరామజోగయ్య బహిరంగ లేఖ!

#nara-lokesh #acb #cid #memo
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe