TS DSC: మెగా డీఎస్సీపై మొదలైన రగడ.. ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష!

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఈడీ అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేయగా పీఈటీ క్యాండెట్స్ సైతం 182 పోస్టులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

TS DSC: మెగా డీఎస్సీపై మొదలైన రగడ.. ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష!
New Update

Telangana DSC Candidates Protest: తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి మరిన్ని పోస్టులు పెంచింది రేవంత్ సర్కార్. అయితే ఇందులో స్కూల్ అసిస్టెంట్ తదితర విభాగాలకు సంబంధించి తక్కవ పోస్టులను కేటాయించడంతో అభ్యర్థులు ఆందోళన చేందుతున్నారు. మరిన్ని పోస్టులు పెంచాలంటూ నిరసనలు చేపడుతున్నారు.

ఆమరణ నిరాహార దీక్ష..

ఈ మేరకు మెగా డీఎస్సీలో (Mega DSC) పోస్టులను వెంటనే పెంచాలంటూ పీఈటీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 వందల పోస్టులు ఖాళీలుండగా కేవలం 182 ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పలుచోట్ల ధర్నాలకు సైతం దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం స్పోర్ట్స్ స్టూడెంట్ ఫేడరేషన్ ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను సవరించి పీఈటీ పోస్టులను పెంచుతూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు. దీనిపై గవర్నమెంట్ వెంటనే స్పందించాలని, లేదంటై తమ దీక్షను ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి: Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు!

బీఈడీ అభ్యర్థులు ఆందోళన..

ఇదిలావుంటే.. మరోవైపు బీఈడీ అభ్యర్థులు సైతం ఆందోళన చెందుతున్నారు. 11 వేలకు పైగా పోస్టుల్లో తమకు 2వేలు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే విషయం చర్చనీయాంశమైంది.

#telangana #osmania-university #mega-dsc #increased-pet-posts
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe