/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/mallareddy-arrest-.jpg)
Ex. Minister Malla Reddy Arrest : మేడ్చల్(Medchal) బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే మల్లారెడ్డి(Malla Reddy) ని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్‌లోని తన భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి ఈ రోజు ఆరోపించారు. ఆ ల్యాండ్ వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు. అయితే.. అది తమ భూమే అంటూ వేరే వ్యక్తులు చెబుతున్నారు. ఆ స్థలంలో వారు బారికేడ్లు కూడా వేశారు. దీంతో తమ స్థలంలో వేసిన బారికేడ్లు తొలగించేందుకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నించారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. నా భూమినే కబ్జా చేస్తార్రా అంటూ మల్లారెడ్డి రచ్చ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయిందని మల్లారెడ్డి ఆరోపించారు. 40ఏళ్లుగా ఈ భూమి తన పేరు మీదే ఉందన్నారు మల్లారెడ్డి.
Also Read : ట్రాఫిక్ పోలీసులతో పని లేదు.. కానీ.. రూల్స్ తప్పితే మోత మోగిపోద్ది!