తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి పదో తరగతి హాల్‌టికెట్లతో సహా మార్కుల మెమోలపై కూడా శాశ్వత విద్యా సంఖ్య (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు-పెన్)ను ముద్రించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ప్రవేశ రిజిస్టర్, హాజరు రిజిస్టర్, రికార్డ్ షీట్/టీసీ తదితర వాటిపై శాశ్వత విద్యా సంఖ్యను రాయడం, ముద్రించడం అనేవి ఈ విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేశారు.
Also Read: నా అల్లుడిని కొట్టారు.. ఐటీ దాడులపై పొంగులేటి సంచలన ఆరోపణలు!
దీంతో ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల యాజమాన్యాలు దీని గురించి తెలుసుకొని ఉండాలని విద్యాశాఖ సూచనలు చేసింది. అందుకే ప్రతి విద్యార్థి పేరు జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్ ఫ్లస్) పోర్టల్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. అలాగే వాటికి సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేయాలని పాఠశాల విద్యాశాఖను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. యూడైస్‌లో ఉన్న విద్యార్థులకు మాత్రమే సాఫ్ట్‌వేర్ ద్వారా శాశ్వత సంఖ్య కేటాయిస్తారని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
Also read: ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు కేటీఆర్ రిప్లై.. ఆనంద్ జీ ఈ విషయం తెలుసా అంటూ