Thyroid: థైరాయిడ్ ఉన్నవారు పల్లీలు తినొచ్చా? డైటీషియన్స్ ఏమంటున్నారు? థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లయితే వేరుశెనగను పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అతిగా తినడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు గ్లూటెన్, కొవ్వు పదార్థాలు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, ఆల్కహాల్, కాఫీకి దూరంగా ఉండాలి. By Vijaya Nimma 12 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Thyroid: థైరాయిడ్ వ్యాధి హార్మోన్ల అసమతుల్యత వలన వస్తుంది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు ఉన్నారు. థైరాయిడ్ గ్రంధి అయోడిన్ సహాయంతో శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. ఎక్కువ మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడేవారు ఉన్నారు. అయితే.. థైరాయిడ్ వ్యాధి రెండు రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం, రెండోవది హైపోథైరాయిడిజం. థైరాయిడ్ వ్యాధి విషయంలో..ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ రోగులు తరచుగా వారి ఆహారం గురించి గందరగోళ పడుతూ ఉంటారు. అందులో వేరుశెనగ తినవచ్చో లేదో తెలుసుకుందాం? అనే డౌట్ ఉంటుంది. థైరాయిడ్ రోగులు వేరుశెనగలు తింటే ఏం అవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వేరుశెనగ తినకూడదా..? థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లయితే వేరుశెనగను పరిమిత పరిమాణంలో తినాలని నిపుణులు చెబుతున్నారు. కానీ ఏదైనా అతిగా తినడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వేరుశెనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా..ఐరన్, జింక్, పొటాషియం, విటమిన్ ఇ వంటి అనేక రకాల కొవ్వు ఆమ్లాలు వేరుశెనగలో పుష్కలంగా ఉన్నాయి. థైరాయిడ్ విషయంలో.. గ్లూటెన్, కొవ్వు పదార్థాలు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, ఆల్కహాల్, కాఫీ మొదలైన వాటిని తినడం, త్రాగడం వంటి వాటికి దూరంగా ఉండాలి. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు రోజూ అయోడిన్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ వ్యాధిలో.. ఏ విధమైన అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలను తినకుండా ఉండాలి. అదే సమయంలో.. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే బరువు పెరిగేకొద్దీ సమస్యలు పెరుగుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: కౌగిలింతలో మజా..బాడీలో వచ్చే మార్పుల వలెనే..!! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: తుమ్మినప్పుడు మూత్రం రావడానికి కారణమేంటో తెలుసా? #health-benefits #thyroid #groundnut మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి