ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు సరైనా ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించవచ్చు. మరి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..!! ఏ పదార్థాలు తీసుకుంటే సమస్య పొతుందో..!! ఇప్పుడు తెలుసుకుందాం. సరైన ఆహార నిమయాలు పాటించకపోతే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. కావున ఎలాంటి ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించే పదార్థాలు
గ్రీన్ టీ: ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టడంలో గ్రీన్ టీ కూడా మెరుగ్గా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు శరీర బరువు తగ్గడంలో చాలాబాగా సహాయపడుతుంది. అదేవిధంగా శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్‌ను తొలగించి కాలేయ వాపు సమస్య రాకుండా చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తుంది.
అవకాడో: ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడేవారికి అవకాడో చాలాబాగా పనిచేసుంది. ఈ అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించి కాలేయాన్ని సురక్షితంగా ఉంచడంతోపాటు బరువు తగ్గడానికి ఇది చాలాబాగా పనిచేస్తుంది.
వెల్లుల్లి: ఫ్యాటీ లివర్ (కాలేయ వాపు) ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి బయట పడాలంటే వెల్లుల్లి ఎక్కువగా ఉపయోగిస్తే చాలా మంచిదట. ఎందుకంటే వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితోపాటు ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని రోజూ తినటం వల్ల ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుదని వైద్యులు చెబుతున్నారు.
ఆహారానికి దూరం ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది
ఈ కాలేయంలో వాపు సమస్య ఉన్నవాళ్లు ఫ్రైడ్ రైస్, పాస్తా, వైట్ బ్రెడ్ లాంటి ప్రాసెస్డ్ ఆహారానికి చాలా దూరం ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తినడంవల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ చాలాఈజీగా పెరుగుతాయి. కాగా.. చక్కెర స్థాయి పెరిగినప్పుడు కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. దాంతో ఫ్యాటీ లివర్ సమస్య మరింత ఎక్కువ అవుతుదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. చక్కెర ఎక్కువగా ఉండే లడ్డూ, ఐస్ క్రీమ్, చాక్లెట్, కూల్ డ్రింక్ లాంటి పదార్థాలు తీసుకోవటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఇంకా ఎక్కువ ప్రమాదకరమని అంటున్నారు. అంతేకాదు వాటితో కాలేయంలో చక్కెరలు చేరి ఫ్యాటీ లివర్ సమస్య మరింత ఎక్కువైయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి: దాల్చిన చెక్కలో దాగిఉన్న పోషకాలు