/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Train-4-jpg.webp)
ఉత్తర భారత్‌లో మరో రెండ్రోజుల్లో ఛఠ్ పూజ జరగనున్న వేళ.. పంజాబ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. చఠ్ పూజ సందర్భంగా ఇంటికి వెళ్లేందుకు ప్రజలు సిద్ధం కాగా.. ఒక్కసారిగా రైలు రద్దు అని ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కోపంతో మరో రైలుపై రాళ్లు విసిరి నిరసన తెలిపారు. ఈ ఘటన ఫతేఘర్ సాహిబ్ జిల్లాలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నార్త్ ఇండియా వైపు ఛఠ్ పూజను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. నాలుగురోజుల పాటు ఈ పండుగ ఉంటుంది. ఈ వేడుక సందర్భంగా ప్రతి ఏడాది చదువు, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు తమ సొంతూళ్లకు వెళ్లిపోతుంటారు. అయితే రైల్వేశాఖ కూడా ఇందుకోసం ప్రత్యేక రైళ్లు నడుపుతుంది.
Also Read: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..దాదాపు 20 మంది మృతి.!
ఉత్తరభారత్‌లో ఈ సమయంలో రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. అయితే పంజాబ్‌లోని ప్రజలు ఎప్పటిలాగే పండుగ వేళ తమ ఇంటికి పయనమయ్యారు. కానీ ఇంతలోనే అనుకోకుండా.. సిర్హింద్ జంక్షన్ నుంచి గోరఖ్‌పూర్ జంక్షన్‌కు బయలుదేరే సహర్సా స్పెషల్ ఫేర్ ఫెస్టివ్ రైలును రైల్వే అధికారులు రద్దు చేశారు. దీంతో ఈ సమాచారం తెలుసుకున్న ప్రయాణికులు మండిపడ్డారు. సిర్హింద్ రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు అక్కడ ఉన్న మరో రైలుపై రాళ్ల దాడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై నెటీజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.
Chaos ensues, and passengers pelted stones at another train at Sirhind Railway station in anger, as the Saharsa Special Fare Festival Train, departing from Sirhind Junction to Gorakhpur Junction, has been cancelled. The passengers were supposed to travel home to celebrate Chath… pic.twitter.com/NuoUh2DvXv
— Gagandeep Singh (@Gagan4344) November 14, 2023
Also Read: రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఫస్ట్ అప్ లోడ్ చేసింది ఇతడే.. వెల్లడించిన ఢిల్లీ పోలీసులు