Watch Video: నితిష్ కుమార్‌ తీరుపై వినూత్నంగా నిరసన.. వీడియో వైరల్

బిహార్‌లో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిష్‌ కుమార్‌పై పలువురు వినూత్నంగా నిరసన చేశారు. దిష్టిబొమ్మను తయారు చేసి చనిపోయినట్లుగా చిత్రీకరించి ఏడ్చారు. ఈడీ లేదా సీబీఐ ఒత్తిడి వల్ల ఇలాంటి పని చేశావా అంటూ ప్రశ్నిస్తూ ఏడ్చారు.

New Update
Watch Video: నితిష్ కుమార్‌ తీరుపై వినూత్నంగా నిరసన.. వీడియో వైరల్

నితీష్ కుమార్‌ మళ్లీ బీజేపీతో జతకట్టి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు తొమ్మిదో ప్రమాణ స్వీకారం. ఇటీవల ఇండియా కూటమిలోకి వచ్చిన నితీష్ కుమార్.. ఆ కూటమితో విభేదాల కారణంగా.. ఆర్జేడీ - కాంగ్రెస్ కూటమిని వీడి శనివారం తన పదవికి రాజీనామ చేశారు. ఈరోజు సాయంత్రం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేరారు. అయితే ఈయన తీరును నిరసిస్తూ బిహార్‌లో కొంతమంది ఆయన చనిపోయినట్లుగా చిత్రీకరించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

Also Read: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్?

ఈడీ లేదా సీబీఐ ఒత్తిడి వల్లేనా 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బిహార్‌లోని హాజీపూర్‌ ఈ సంఘటన చోటుచేసుకుంది. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం నుంచి విడిపోయి ఎన్డీయేతో కలిసిన జేడీయూ చీఫ్ నితిష్‌ కుమార్‌ దిష్టిబొమ్మను తయారు చేశారు. ఆయన చనిపోయినట్లు కొంతమంది ఏడ్చారు. ఎదుకు బీజేపీతో జత కట్టావంటూ ప్రశ్నించారు. ఈడీ లేదా సీబీఐ ఒత్తిడి వల్ల ఇలాంటి పనికి పాల్పడ్డావా అంటూ ఏడుస్తూ కనిపించారు.

ఇద్దరు బీజేపీ నేతలు డిప్యూటీ సీఎంలుగా 

ఇదిలా ఉండగా.. బీహార్‌ ముఖ్యమంత్రిగా రాజ్‌భవన్‌లో నితీష్‌ కుమార్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఆ తర్వాత మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరిలు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా, నితీష్‌ కుమార్‌ బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

కూటములు మారుస్తూ వచ్చిన నితిష్

అయితే.. 2000 నుంచి ఇప్పటివరకు 9వ సారి ముఖ్యమంత్రిగా నితీష్‌ ప్రమాణం చేశారు. ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీష్‌ భారత చరిత్రలో నిలిచిపోయారు. 2000లో వారం రోజులు సీఎంగా పని చేసిన నితీష్‌.. ఆ తర్వాత నుంచి కూటములు మారుస్తూ.. సీఎంగా ఉంటూ వస్తున్నారు.

Also Read: ఉప్పల్‌లో తిప్పలు పడ్డ టీమిండియా.. ఫస్ట్ టెస్ట్‌లో తప్పని పరాభవం

Advertisment
తాజా కథనాలు