Cashew: పుష్కలమైన పోషకాల కోసం బాదం(Almond), వాల్ నట్స్ , రైసిన్స్, ఖర్జూర, జీడిపప్పు(Cashew), అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ ఆహారంలో చేర్చుకుంటారు. వీటిలో ప్రోటీన్ , కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎముకల దృఢత్వానికి, జ్ఞాపకశక్తి పెరుగుదల, రోగనిరోధక శక్తి, ఒత్తిడి, వంటి సమస్యల ఇవి మంచి ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో చాలా మంది ఎక్కువగా వాడేది, తినడానికి ఇష్టపడేది జీడి పప్పు. ప్రతీ స్వీట్ లేదా ఏదైనా సరే జీడి పప్పు పక్కా ఉండాలని అనుకుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉంటే మంచిది. ఆ సమస్యలను ఇవి మరింత ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
ఈ సమస్యలు ఉన్నవారు జీడి పప్పుకు దూరంగా ఉండడం
కిడ్నీ సమస్యలు
జీడి పప్పులో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అధిక ఫాస్పరస్ శరీరంలోని క్యాల్షియం శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల ఎముకల బలహీనత, కీళ్ల నొప్పుల, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కావున ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం లేదా దూరంగా ఉండడం మంచిది.
ఎలర్జీ
ఎలర్జీ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు. కొంత మంది శరీరం కొన్ని ఆహారాలకు సున్నితంగా ఉంటుంది. జీడి పప్పు లో అలర్జీ పెంచే గుణాలు ఉంటాయి. కావున ఇవి తింటే ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. అందుకే వీటికి దూరంగా ఉండాలి.
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు
వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కావున శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తక్కువగా తీసుకోవడం మంచిది. దీని వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రై చేసినప్పుడు వీటిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ మరింత పెరుగుతాయి.
Also Read: Alcohol Tips: ఆల్కహాల్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఆరోగ్యం పాడైనట్ల