AP Pensions : రేపు ఉదయం 6 గంటల నుంచి రూ.4,000 పంపిణీ

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ జరగనుంది. పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. దీని ద్వారా 65.18 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పంపిణీ కోసం రూ.4, 408 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

New Update
AP Pensions : రేపు ఉదయం 6 గంటల నుంచి రూ.4,000 పంపిణీ

CM Chandrababu : రేపు ఏపీ (Andhra Pradesh) లో ఎన్టీఆర్ భరోసా (NTR Bharosa) పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. పెనుమాకలో పింఛన్లను (Pensions) పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యకర్తమంలో పాల్గొంటారు. మొదటిరోజే వంద శాతం పంపిణీ చేయాలి అధికారులకు సీఎస్‌ నీరభ్‌కుమార్ (CS Neerabh Kumar) ఆదేశం ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీని ద్వారా 65.18 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పంపిణీ కోసం రూ.4, 408 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులకు సీఎస్ హెచ్చరించారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డబ్బు చేరినట్లు చెప్పారు.

Also Read : అల్లరి నరేష్ ఊరమాస్ పెర్ఫార్మెన్స్.. అంచనాలు పెంచేసిన ‘బచ్చల మల్లి’ గ్లింప్స్..!

Advertisment
తాజా కథనాలు