ఏపీ రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. అధికార పక్షంలో ఉన్నవారే తమ నాయకుని మీద తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. తాజాగా జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేపట్టినప్పటి నుంచి కూడా చాలా మంది జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అధిష్టానం పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తనను గుర్తించడం లేదని..ఇది చాలా దురదృష్టకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ నియోజకవర్గ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని పార్థసారథి చెప్పారు.
తాను ఎక్కడ ఉన్నా..పెనమలూరు ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. వైసీపీ సామాజిక బస్సు యాత్ర సభలో పాల్గొన్న పార్థసారథి మాట్లాడారు. ''నామినేషన్ వేసిన ప్రతీసారి పార్థసారథి ఓడిపోయాడు.. పెనమలూరు తెలుగుదేశందేనని చెప్పుకుంటుంది. కానీ, అన్ని వర్గాల సహకారంతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నట్లు'' పార్థసారథి చెప్పారు.
ఇదిలా ఉంటే వైసీపీలో నియోజక వర్గ ఇంఛార్జీల మార్పులు జరుగుతున్న సమయంలో పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత మంత్రి జోగి రమేష్ ఒక్కసారిగా వేదిక దిగి వెళ్లిపోయారు.
కంకిపాడులో జరిగిన సామాజిక సాధికార సభలో వైసీపీ బీసీ ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also read: అయోధ్య లోని విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా!