YCP MLA: జగన్‌ కి షాక్‌ ..టీడీపీ గూటికి పెనమాలూరు ఎమ్మెల్యే!

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ కి గుడ్‌ బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు సారథిని కలిసి మాట్లాడారు.

New Update
YCP MLA: జగన్‌ కి షాక్‌ ..టీడీపీ గూటికి పెనమాలూరు ఎమ్మెల్యే!

AP Politics: ఏపీ రాజకీయాలు (AP Politcs) రోజుకో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ(YCP), టీడీపీ(TDP)ల నుంచి జంపింగ్‌ జాపంగ్‌ లుఎక్కువ అయిపోయారు. ఎన్నికలు తరుముకొస్తున్న సందర్భంగా వైసీపీ ప్రభుత్వం సీట్ల మార్పులు, చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Partha Saradhi)ఫ్యాన్‌ కట్టేసి..సైకిల్ ఎక్కనున్నట్లు సమాచారం.

ఇంకా అసంతృప్తితోనే..

వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు..చేర్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో పార్థసారథి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన జగన్ తో పలుమార్లు భేటీ అయినప్పటికీ కూడా ఆయన ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వైసీపీ రీజనల్ కో- ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి కూడా పార్థసారథితో అరగంట పాటు చర్చలు జరిపారు.

మంగళవారం సీఎం జగన్ ను కలిసిన పార్థసారథి వచ్చే ప్రభుత్వంలో బెర్త్‌ పై హామీ కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం. సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని జగన్‌ దృష్టికి తీసుకెళ్లి అయోధ్య రామిరెడ్డి. ఎలా స్పందిస్తోందో చూడాలి. ఈ క్రమంలో పార్థసారథి టీడీపీలో చేరతారనే విస్తృత ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్థసారథి ఇంటికి వెళ్లిన కొందరు టీడీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం.

సారథి ఇంటికి టీడీపీ నేతలు..

టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం ముఖ్య టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు ఇరువురు కూడా పార్థసారథితో భేటీ అయ్యారు. దీంతో పార్థసారథి వైసీపీని విడి టీడీపీకి జంప్‌ అయిపోతున్నట్లు సమాచారం. అయితే పార్థసారథి ఏ నిర్ణయం తీసుకున్నారు అనే దాని మీద మాత్రం స్పష్టత లేదు.

పార్థసారథి ఇప్పటి వరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ లో ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఈ క్రమంలోనే ఆయన జగన్‌ కేబినెట్‌ లో కూడా ఆయన పదవి ఆశించారు కానీ ఆయనకకు పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ప్రయాణం ఎటువైపో...

దాంతోనే ఆయన తన ఆవేదనను పార్టీలోని సీనియర్‌ నేతల ముందు వెల్లడించారు. దీంతో సారథి పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు ఫుల్లుగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సారథి ని మీడియా సిబ్బంది టీడీపీలో చేరుతున్నారట కదా అని ప్రశ్నించినప్పటికీ ..ఆయన నవ్వారు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే మరి కొలుసు పార్థసారథి ప్రయాణం ఎటువైపో వేచిచూడాలి.

Also read: వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని..ఇప్పటికే కొందరు సన్నిహితులతో..!

Advertisment
Advertisment
తాజా కథనాలు