బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్!

స్పెయిన్ లోని మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేస్తే రూ. 67వేల జరిమానా విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మార్బెల్లా నగరం నీటి స్వచ్ఛతను కాపాడేందుకు ఈ కొత్త నిబంధనను తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు.

New Update
బీచ్ లో మూత్రవిసర్జన చేస్తే రూ.67 వేలు ఫైన్!

మార్బెల్లా సముద్రంలో మూత్ర విసర్జన చేసే వ్యక్తులు మొదటిసారి  పాల్పడితే రూ.67 వేలు జరిమానా విదిస్తామని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత మళ్లీ ఏడాదిలోపు అదే తప్పు చేస్తూ పట్టుబడితే జరిమానా లక్ష వరకు ఉంటుందని ఇదే పునరావృతం చేసేవారికి మరింత శిక్ష పడుతుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నిబంధనలపై ఆయా ప్రాంత ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం కావడంతో.. ప్రభుత్వం నుంచి కొంతమేరకు వివరణ ఇచ్చింది. బీచ్‌లలో నిలబడి సముద్రంలో మూత్ర విసర్జన చేసే వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది.సముద్రంలో మూత్ర విసర్జన చేయడం గురించి కాదు, కానీ బీచ్‌లో చెడు ప్రవర్తనపై పూర్తిగా నిషేధం. 2004లో, మలాగా బీచ్‌లో  ఇటువంటి ప్రవర్తనకు రూ. 27వేల జరిమాన  విధించింది. ఇటీవల, గలీషియన్ నగరం విగో రెండేళ్ల క్రితం ఇదే నేరానికి రూ. 67వేల జరిమానా అక్కడి అధికారులు విధించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు