Peetambaram leave: క్యాన్సర్‌ సహా ఐదు వ్యాధులకు ఈ ఆకు నుంచి ఉపశమనం

పీతాంబరం మొక్క ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదంలో ఒకటి. పీతాంబరం ఆకులతో డిప్రెషన్, క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులను నియంత్రించవచ్చు. ఈ ఆకులను రోజూ తినటం వలన రోగాల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు.

Peetambaram leave: క్యాన్సర్‌ సహా ఐదు వ్యాధులకు ఈ ఆకు నుంచి ఉపశమనం
New Update

Peetambaram leave health benefits: ప్రస్తుతం మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లలో మార్పులతో చాలామంది పలు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికితోడు కొలెస్ట్రాల్, మధుమేహం, బ్లడ్ ప్రెషర్, గుండె సంబంధ వ్యాధులు ప్రజల్నీ ఇంకా వేధిస్తున్నాయి. పీతాంబర ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, ఫంగల్, మకరందం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో పీతాంబర మొక్క ఒకటి. ఇవి దేశంలో చాలా ఉన్నాయి. ఈ ఆకులను తింటే ఐదు ప్రధాన వ్యాధులకు దూరం అవుతాయి. ముఖ్యంగా పీతాంబర ఆకులకు డిప్రెషన్, యాంగ్జయిటీ నుంచి ఉపశమనం కలిగించే శక్తి పుష్కలంగా ఉంది. ఈ మధ్య కాలంలో డిప్రెషన్, చర్మ, క్యాన్సర్ వ్యాధులు తగ్గించడానికి టాబ్లెట్లు వేసుకుంటారు. కానీ.. పీతాంబరం ఆకు తింటే కేంద్ర నాడీ వ్యవస్థతో పాటు ఐదు వ్యాధులను దూరం చేయవచ్చు.
పితాంబర్ ఆకులు తింటే ప్రయోజనాలు:
క్యాన్సర్‌: పీతాంబరానికి క్యాన్సర్‌ను నిరోధించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. పీతాంబర్ ఆకుల నుంచి తీసిన రసం క్యాన్సర్ కణాలను చంపుతుందని ప్రయోగాలలో గుర్తించారు. పితాంబర్ ఆకులలో ఫ్లేవనాయిడ్, కెంప్ఫెరోల్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.
చక్కెర: పీతాంబర ఆకులు బ్లడ్ షుగర్ నియంత్రణకు దివ్యౌషధం అంటారు. పీతాంబర మొక్కల్లో డీ గ్లూకోసైడ్, ఫ్లేవోన్లు, గ్లైకోసైడ్లు, ఫ్లేవనాయిడ్లు, అల్లాటినోన్‌ అనేక రకాల జీవక్రియ సమ్మేళనాలు జీవక్రియను పెంచి సహజ మార్గంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: సొట్టబుగ్గలపై అసలు విషయం చెప్పిన సైన్స్‌.. కారణం ఇదే

డిప్రెషన్‌: పీతాంబర ఆకులకు యాంగ్జయిటీ, డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉంది. పీతాంబర ఆకులను తీసుకోవడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ సున్నితంగా మారి తద్వారా శరీరం నుంచి నిష్క్రియాత్మకత తొలగిపోతుంది. డిప్రెషన్ డ్రగ్ ఫ్లూక్సెటైన్‌ తరహాలోనే పీతాంబర మొక్క నుంచి సేకరించిన సమ్మేళనం పనిచేస్తుందని అధ్యయనంలో తెలిపారు.
రక్తంలో ప్లేట్‌లెట్లను పెంచడం: రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరగాలంటే ప్రతీరోజూ ఉదయం పితాంబర ఆకులు తినాలని ఓ అధ్యయనంలో తెలిపారు. పితాంబర ఆకు రసాన్ని నెల రోజులు తింటే గాయం త్వరగా మానుతాయి.
చర్మ సంబంధిత వ్యాధులు: యాంటీ ఫంగల్, బాక్టీరియల్ లక్షణాలు ఉన్న పీతాంబర ఆకుల పేస్ట్‌ను చర్మంపై రాసుకుంటే మొటిమలు, టినియా వెర్సికలర్, కాండిడా అల్బికాన్స్, రోసేసియా, టీ.సెమీ, టీ.హునాటా, సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

#health-benefits #peetambaram-leave
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe