పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను శాసిస్తున్నారన్నారు..

పుంగనూరు హింసపై రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ నేతలు చంద్రబాబును చిత్తూరు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ కలిసే ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు.

పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను శాసిస్తున్నారన్నారు..
New Update

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హింసను సృష్టించాలని చూస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గూండాలకు డాన్‌లా వ్యవహరిస్తోన్నారని ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబు పాత సినిమాల్లో బందిపోటులా దాడి చేయించారన్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరిగే బాబు.. పుంగనూరులో 40 సంవత్సరాల రౌడీయిజాన్ని చూపించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుంగనూరు ఘటన రాష్ట్రంలో ఒక్క బ్లాక్‌ డేగా నిలిచిపోనుందన్నారు.

చంద్రబాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సవాల్‌ చేయడం హస్యాస్పదంగా ఉందని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు హీరో అన్న ఆయన.. రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాను శాసిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడికి తన సొంత నియోజకవర్గంలో సర్పంచ్‌లు కూడా లేరని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న నాగేశ్వరరావు.. ప్రజలు మళ్లీ జగన్‌నే సీఎం చేయాలని కోరుకుంటున్నారన్నారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఆఫీస్‌లకు తాళాలు వేసుకోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి.. పవన్‌ కళ్యాణ్‌ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతారన్నారు. తన తండ్రి కానిస్టేబుల్ అని చెప్పుకునే పవన్‌.. పుంగనూరుతో అంతమంది కానిస్టేబుళ్లకు గాయాలైతే ఎందుకు స్పందించలేదన్నారు. మరోవైపు కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి వస్తుందని లోకేశ్‌ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యకర్తలను ఉసిగొలుపుతున్న లోకేశ్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లపై విచారణ జరిపించాలన్నారు. టీడీపీ కార్యకర్తల దాడికి పోలీసులు సైతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పోలీసులను చంద్రబాబు అంతలా భయబ్రాంతులకు గురిచేస్తోన్నారన్న ఆయన.. ఎస్పీ స్థాయి అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టడం ఎంటని, అదేనా 40 సంవత్సరాల రాజకీయ అనుభవమని మంత్రి ప్రశ్నించారు. గతంలో మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై జనసేన గూండాలు దాడి చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుర్తు చేశారు. 100 మంది గూండాలు విశ్వరూప్‌ ఇంట్లోకి వెళ్లి ఆయన ఇంట్లో ఉన్న కార్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారని, అనంతరం ఆయన ఇంటికి నిప్పంటించారన్నారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారని, ఇంట్లో ఉన్న ఆడవాళ్లను కూడా చంపాలని చూశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే జనసేన, టీడీపీ కార్యకర్తలు ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి కాకుండా చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ఇలాంటి నేతలను ప్రజలు ఎలా గెలిపిస్తారమని మంత్రి ప్రశ్నించారు.

#ycp #tdp #punganur #minister-peddireddy #karumuri-nageswara-rao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe