Paytm : పేటీఎం మూసేస్తారని భయంతో ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య!

గౌరవ్‌ గుప్తా (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇండోర్‌ లోని పేటీఎం ఆఫీసులో ఆపరేషన్‌ ఫీల్డ్‌ మేనేజర్‌ గా పని చేస్తున్నాడు. ఆర్బీఐ పేటీఎం మీద విధించిన నిబంధనలు కారణంగా ఎక్కడ ఉద్యోగం పోతుందో అనే భయంతో గౌరవ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
Paytm : పేటీఎం మూసేస్తారని భయంతో ఫీల్డ్ మేనేజర్ ఆత్మహత్య!

Paytm Field Manager Suicide : పేటీఎం(Paytm) ఎక్కడ మూతపడిపోతుందో... తన ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ఓ ఆపరేషన్ ఫీల్డ్‌ మేనేజర్ ఇండోర్(Indore) లో ఆత్మహత్య(Suicide)  చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్‌ గుప్తా(Gaurav Gupta) (40) అనే వ్యక్తి గత కొంతకాలంగా ఇండోర్‌ లోని పేటీఎం ఆఫీసులో ఆపరేషన్‌ ఫీల్డ్‌ మేనేజర్‌(Operation Field Manager) గా పని చేస్తున్నాడు.

అయితే నిబంధనలు అతిక్రమించినందుకు గానూ ఆర్బీఐ(RBI) పేటీఎం మీద పలు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే సోమవారం పేటీఎం సీఈవో కూడా తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో చాలా మంది పేటీఎం ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో తెలియని స్థితిలో వారు ఉన్నట్లు సమాచారం.

ఆ ఒత్తిడితోనే గౌరవ్‌ ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ విషయం గురించి గౌరవ్‌ భార్య పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత గౌరవ్‌ మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అందించారు.

ఆదివారం మధ్యాహ్నం గౌరవ్ తండ్రి సురేష్ గుప్తా పోలీసులతో మాట్లాడారు. గత కొద్ది రోజులగా గౌరవ్ ఉద్యోగం విషయంలో చాలా ఒత్తిడిగా ఉన్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే నిన్న పేటీఎం సీఈవో కూడా తన బాధ్యతలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించే సరికి ఇంకా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన వివరించారు.

ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అసలు కారణం ఏంటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గౌరవ్‌కి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. అతనికి భార్య మోహిని, ఏడున్నర సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. భార్య మోహిని పోలీసులకు ఇచ్చిన ప్రాథమిక సమాచారంలో.. ఉద్యోగం కారణంగా కొన్ని రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాడు. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

Also read: నైలు నదిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి!.

Advertisment
తాజా కథనాలు