Paytm Crisis Started Corrections : పేటీఎం(Paytm) మాతృ సంస్థ వన్-97 కమ్యూనికేషన్స్(One97 Communications) బోర్డు శుక్రవారం, ఫిబ్రవరి 9న గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. కంప్లయన్స్ - రెగ్యులేషన్ విషయాలను మరింత బలోపేతం చేయడంలో బోర్డుతో కలిసి పనిచేయడానికి గ్రూప్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కమిటీకి సెబీ(SEBI) మాజీ చీఫ్ ఎం. దామోదరన్ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీలో ఆర్‌బిఐ నామినేట్ చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మాజీ ప్రెసిడెంట్ ముకుంద్ మనోహర్ చితాలే వంటి అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్నారు. చితాలే బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (NACAS)కి మాజీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కూడా కావడం గమనార్హం. చితాలేతో పాటు ఆంధ్రాబ్యాంక్ మాజీ ఛైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. రామచంద్రన్ వంటి బ్యాంకింగ్ నిపుణులు కూడా ఈ ప్యానెల్‌లో ఉన్నారు.
జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ నిషేధం..
ప్రుడెన్షియల్ రెగ్యులేషన్‌ను దీర్ఘకాలంగా పాటించడం లేదని పేర్కొంటూ జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై(Paytm Crisis) ఆర్‌బీఐ పెద్ద వ్యాపార పరిమితులను విధించింది. Paytm KYC లో RBI పెద్ద అవకతవకలను కనుగొంది. దీని కారణంగా వినియోగదారులు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారని ఆర్బీఐ చెప్పింది. Paytm మిలియన్ల(Paytm Crisis) మంది కస్టమర్ల KYC చేయలేదని తేలింది. లక్షల ఖాతాల పాన్ ధ్రువీకరణ జరగలేదు. బహుళ కస్టమర్ల కోసం ఒకే పాన్ ఉపయోగిస్తున్నారు. చాలా సందర్భాలలో, బ్యాంకు ద్వారా RBI కి తప్పుడు సమాచారం అందించడం జరిగింది. ఆర్‌బీఐ కూడా పెద్ద సంఖ్యలో పాసివ్ ఎకౌంట్స్ ను గుర్తించింది.
Also Read: ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు?
దీంతో Paytmపై(Paytm Crisis) పలు ఆంక్షలు విధించింది ఆర్బీఐ. ఈ నేపథ్యంలో పేటీఎం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. మరోవైపు ఆర్బీఐ కూడా పేటీఎం పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. మీడియా కథనాల ప్రకారం, Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన నిషేధం గడువును ఫిబ్రవరి 29 నుండి పొడిగించాలని RBIని పేటీఎం అభ్యర్థించింది. దీనితో పాటు, వ్యాలెట్ వ్యాపారం మరియు ఫాస్టాగ్‌లో లైసెన్స్ బదిలీ స్థితికి సంబంధించి కంపెనీ స్పష్టత కోరింది. ఈ విషయాలపై ఆర్బీఐ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.
Watch This Interesting Video :