PawanKalyan Birthday Wishes: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య అభిమానుల వరకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రక్తదానాలతో పాటు అన్నదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
"జనహితమే లక్ష్యంగా, వారి ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో, నీ ఆశయాలు సిద్ధించాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ, ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ, నీకు జన్మదిన శుభాకాంక్షలు!" అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.
"సోదరుడు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.
"ప్రియమైన పవన్ కల్యాణ్‌కి జన్మదిన శుభాకంక్షలు.. ఈ సంవత్సరం మీకు విజయాలతో పాటు సంతోషం కలగాలని కోరుకుంటున్నాను" అని మహేష్‌బాబు ట్విట్టర్‌లో తెలిపారు.
"పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు విజయాలతో పాటు సంతోషం కలగాలని కోరుకుంటున్నాను" అంటూ రవితేజ విషెస్ చెప్పారు.
"నా చిన్న మామయ్య, నా గురువు, మహోన్నతమైన ప్రజానాయకుడు పవన్ కల్యాణ్‌కి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, విజయం & శాంతితో ఉండాలని ప్రార్థిస్తున్నాను మరియు నేను ఆ మాయా కౌగిలింతలను ఎక్కువగా పొందుతున్నాను" అని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.
"సినీ నటులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న రియల్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను" అని లోకేష్ తెలిపారు.
Also Read: ‘వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాన్ కడగలేకపోయింది’ దుమ్మురేపుతోన్న పవన్ ఓజీ టీజర్..!!
"జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనహితమే లక్ష్యంగా నిజాయితితో పనిచేసే మీకు మీ ఆశయాలు నెరవేరాలనీ..మరెన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విష్ చేశారు.
మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గం అత్తోట గ్రామ రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కౌలు రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా పొలంలో జనసేన పార్టీ చిహ్నాన్ని, తమ మనసులో భావాన్ని వరి నాట్లుగా వేశారు.
ఇక మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యకర్తలతో పాటు నేతలు రక్తదానం చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తిరుపతిలోని జనసేన నేతలు కిరణ్ రాయల్, రాజారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన పార్టీ సామాజిక కార్యక్రమాల్లో ముందుంటుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జనసేన నేతలు ఏపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, రెల్లి వర్గాలతో సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టిఫిన్ చేశారు.
Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. పవర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్..