Pawan Kalyan : టార్గెట్ అల్లు అర్జున్.. పుష్ప క్యారెక్టర్‌పై పవన్ కల్యాణ్ డైరెక్ట్ అటాక్!

సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఇప్పడు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు చేస్తున్నారన్నారు. పుష్పను ఉద్దేశించే పవన్ ఈ కామెంట్స్ చేశారంటూ నెట్టింట చర్చ మొదలైంది.

New Update
Pawan Kalyan : టార్గెట్ అల్లు అర్జున్.. పుష్ప క్యారెక్టర్‌పై పవన్ కల్యాణ్ డైరెక్ట్ అటాక్!

Pawan Kalyan Sensational Comments On Pusha Movie : సినిమాల్లో పాత్రలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే.. ఈ రోజుల్లో యువ హీరోలంతా మాఫియా, స్మగ్లిం

గ్ పాత్రలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారింది. ఇప్పుడు హీరోలు అడవిని నాశనం చేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారు. రాజ్‌కుమార్‌ గందధ గుడి సినిమా అంటే నాకు ఇష్టం. అడవిని రక్షించడమే గందధ గుడి సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అడవిని రక్షించడం ఫారెస్ట్ అధికారుల విధి అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అయితే పవన్ కల్యాణ్ కామెంట్స్ పై నెట్టింట జోరుగా చర్చ మొదలైంది. అల్లు అర్జున్ పుష్పను ఉద్దేశించే పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు బెంగళూర్ పర్యటనకు వెళ్లిన సీఎం పవన్.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు