/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-02T121306.232-1.jpg)
Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేత శిల్పారవికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం మెగా ఫ్యామిలీలో చిచ్చురేపింది. ఆ తర్వాత అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ మరింత వివాదాస్పదంగా మారింది. ఇది కాస్త మెగా vs అల్లు ఫ్యాన్స్ వివాదంగా మారింది. వైసీపీ నేతకు సపోర్ట్ చేసిన విషయంలో అల్లు అర్జున్ సమర్థిస్తూ ఆయన ఫ్యాన్స్, ఆయనకు వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చిన్నపాటి కామెంట్ల యుద్ధమే సృష్టించారు. ఇక అప్పటి నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయని, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని అనేక కథనాలు వచ్చాయి.
బన్నీకి పవన్ రిప్లై
ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ బర్త్ డే కు అల్లు అర్జున్ ట్వీట్ చేయగా ... పవన్ కళ్యాణ్ స్పందించారు. 'థ్యాంక్స్' అల్లు అర్జున్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇరు కుటుంబాల మధ్య విభేదాలు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ విష్ చేయడం, పవన్ కళ్యాణ్ రిప్లై పెట్టడం విశేషంగా మారింది. దీంతో బయట అనుకుంటున్నట్లుగా వీరిమధ్య ఎలాంటి బేదాభిప్రాయాలు లేనట్లే అన్నట్లుగా అర్థమవుతుంది.
Thank you, @alluarjun , for your warm wishes - @PawanKalyan https://t.co/6gh4AMPvRR
— JanaSena Party (@JanaSenaParty) September 2, 2024
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
Also Read: NTR: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు NTR రూ. కోటి విరాళం..! - Rtvlive.com