/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Screenshot-2023-10-28-124036.png)
Varun, Lavanya Wedding: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య ఎంగేజ్మెంట్ జూన్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇటీవలే వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల మధ్య చాలా ఘనంగా జరిగాయి. ఇక వీరిద్దరికి నవంబర్ 1 న వివాహం జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వరుణ్, లావణ్య ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. అయితే ఇప్పటికే వరుణ్, లావణ్య పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకొని ఇటలీ బయలుదేరారు. తాజాగా రాంచరణ్, ఉపాసన తమ కూతురుతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిహారికతో పాటు పలు మెగా కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకల కోసం ఇటలీ చేరుకున్నారు. మెహందీ, సంగీత్, వెడ్డింగ్ ఇలా మూడు రోజుల పాటు వరుణ్, లావణ్యల పెళ్లి ఘనంగా జరగబోతుంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి సందడి చేయనున్నారు.
ఈ పెళ్లి వేడుకల కోసం పవన్ కళ్యాణ్ దంపతులు ఇటలీ బయలుదేరారు. భార్య అన్నా లెజ్నెవా తో ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నవంబర్ 1 న జరగబోయే వరుణ్, లావణ్యల పెళ్ళికి పవన్ కళ్యాణ్ దంపతులు హాజరు కానున్నారు.
ఇప్పటికే వరుణ్, లావణ్యల వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవంబర్ 1న ఇటలీలో వివాహం పూర్తి చేసుకొని, నవంబర్ 5 న హైదరాబాద్ లో గ్రాండ్ రెసెప్షన్ నిర్వహించనున్నారు. వరుణ్, లావణ్యల రెసెప్షన్ వేడుకలకు సినీ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం.
#TFNExclusive: Visuals of Power Star @PawanKalyan along with his wife while leaving to Italy to attend #VarunLav wedding ceremony!!📸#PawanKalyan #OG #UstaadBhagatSingh #HHVM #TeluguFilmNagar pic.twitter.com/H9aITvqhSP
— Telugu FilmNagar (@telugufilmnagar) October 28, 2023
Finally 😍 Megacouple #Varunlav heading to Italy for their dream wedding off from Hyderabad papped together at airport @IAmVarunTej@Itslavanya#Varuntej #lavanyatripathi #bigfatwedding #megacelebration#southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/OexWdOjFVC
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 26, 2023