/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-07T093637.922.jpg)
AP-TG News : తెలంగాణ (Telangana) క్యాబ్ డ్రైవర్లు ఏపీ డ్రైవర్ల పట్ల మానవత్వంతో నడుచుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోరారు. ఉమ్మడి రాజధాని గడువు ముగియగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్‌లో వెహికిల్స్ నడపకూడదంటూ తెలంగాణ డ్రైవర్లు అడ్డుకోవడం సరికాదన్నారు. క్యాబ్ లపైనే ఆధారపడి రెండు వేల కుటుంబాల బతుకుతున్నాయని గుర్తు చేశారు. అలాగే ఏపీలో రాజధాని పనులు మొదలుకాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని, అప్పటి వరకూ సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి:Police Firing : విచక్షణ కోల్పోయిన పోలీసులు.. ఒకరిపై ఒకరు కాల్పులు!
ఈ మేరకు మంగళగిరి (Mangalagiri) జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ అర్జీలు స్వీకరించారు. ఆల్ ఇండియా పర్మిట్ (All India Permit) తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్‌లు నడుపుతున్న రాష్ట్రానికి చెందిన తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ డ్రైవర్లకు హామీ ఇచ్చారు.