Pawan Kalyan : ఓ వైపు వర్షం.. మరో వైపు కాలి గాయం : పిఠాపురంలో పవన్ రోడ్ షో ఆలస్యం

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఈ రోజు నిర్వహించ తలపెట్టిన రోడ్ షో వర్షం కారణంగా ఆలస్యం కానుంది. ఇప్పటికే మంగళగిరి నుంచి పవన్ కల్యాణ్ పిఠాపురానికి బయలుదేరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేన కార్యకర్తలు భారీగా రోడ్ షోకు తరలివస్తున్నారు.

New Update
Pawan Kalyan : ఓ వైపు వర్షం.. మరో వైపు కాలి గాయం : పిఠాపురంలో పవన్ రోడ్ షో ఆలస్యం

Pithapuram : పిఠాపురంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) రోడ్ షోకు వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం(Heavy Rain) రావడంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే.. వర్షం కారణంగా పవన్ రోడ్ షో(Road Show) కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో పిఠాపురానికి పవన్ బయలుదేరారు. మరోవైపు పవన్ కల్యాణ్ కాలికి గాయం కావడంతో ఇబ్బంది పడుతున్నారు.

Also Read : నా చెల్లి రోజమ్మను గెలిపించండి.. నగరిలో జగన్ స్పీచ్-LIVE

Advertisment
తాజా కథనాలు