/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/pawan-5-jpg.webp)
Pawan Kalyan Movie Ustaad Bhagat Singh: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, పవన్ కళ్యాణ్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో హరీష్ ఈ సినిమాని పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
Also read: అందంతో రెచ్చగొడుతున్న అనుపమ.. లేటెస్ట్ పిక్స్ మాములుగా లేవుగా..!
పవన్ ఈ మూవీని పక్కన పెట్టేయడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకున్నారు. ఎన్నికలు అయ్యాకే ఈ సినిమా ఉండొచ్చు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ, సడెన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని మూవీ యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్స్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు.
Expect the unexpected 😎
19th March ❤️🔥❤️🔥❤️🔥#UstaadBhagatSinghpic.twitter.com/JZfYC5en6y
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2024
మార్చ్ 19న ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు అర్థమవుతోంది. పవన్ పొలిటికల్ కి ఉపయోగపడేలా, పొలిటిల్ డైలాగ్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరో రెండు రోజుల్లో రాబోయే ఈ గ్లింప్స్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూట్ మాత్రం ఎన్నికలు అయ్యాకే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ గా ఉపయోగపడటానికి మాత్రమే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Watch ThisUstaad Bhagat Singh Trailer: