AP : పవన్ మానసికస్థితి బాగోలేదు.. నాకు బాధగా ఉంది : బాలకృష్ణ కామెంట్స్

ముమ్మిడివరం అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించడం‌ బాధాకరమంటూ పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని చెప్పారు. తనకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

AP : పవన్ మానసికస్థితి బాగోలేదు.. నాకు బాధగా ఉంది : బాలకృష్ణ కామెంట్స్
New Update

Amaravati : జనసేన(Janasena) నాయకుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మానసిక స్థితి గురించి పార్టీ పి.ఎ.సి సభ్యులు పితాని బాలకృష్ణ కామెంట్స్(Pithani Balakrishna Comments) ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్ది జనసేనాని ఒత్తిడికి లోనవుతున్నారని అన్నారు. అంతేకాదు పొత్తులో భాగంగా ముమ్మిడివరం అసెంబ్లీ సీటును తెలుగుదేశం(Telugu Desam) కు కేటాయించడం‌ కొంచెం బాధాకరమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఒత్తిడికి గురయ్యారు..

ఈ మేరకు సోమవారం ముమ్మిడివరం(Mummidivaram) జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్ ఏ ఒత్తిలకు గురయ్యారో తెలియదని చెప్పారు. గతంలో తనను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, జగన్ మోహన్ రెడ్డి నన్ను మోసంచేసారని, అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్టి ఇటీవల తనను పిలిచి ఎం.ఎల్.సి ఇస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ తాను ప్రజల్లో గెలిచి చూపిస్తాననే నమ్మకంతో ఆ పార్టీనుంచి బయటకు వచ్చానని, పవన్ కళ్యాణ్ పిలిచి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారని చెప్పారు.

ఇది కూడా చదవండి : Hyderabad : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీల హస్తం!

సంయమనం పాటించండి..

'నేను పోలీసు నేపథ్యం నుండి వచ్చిన వాడిని. పవన్ కళ్యాణ్ తండ్రి కూడా పోలీసు నేపథ్యం నుండి వచ్చిన వారే. కాబట్టి నన్ను ఒక కుటుంబ సభ్యుడిలా చూసారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ ను కలవడానికి వెళ్లాను. ఆయన ఒత్తిడిలో ఉండడంతో నాదెండ్ల మనోహర్ తో మాట్లాడమని చెప్పారు. ఆయన నాకు తప్పకుండా ఎక్కడో ఒకచోట సీటు ఇస్తామని చెప్పారు. నాకు గతంలో జగన్ మోహన్ రెడ్డి అనే ఎం.ఎల్.సి ఇస్తానని చెప్పినా నేను బయటకు వచ్చాను. పవన్ కళ్యాణ్ నాకు తప్పకుండా న్యాయం చేస్తారని‌ మనస్పూర్తిగా నమ్ముతున్నాను. కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. తాడేపల్లిగూడెం సభ తరువాత అధిష్టానం మనకు న్యాయం చేస్తుంది. అధిష్టానం నూటికి నూరుపాళ్లు నాకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడో ఒకచోట అసెంబ్లీ సీటును కేటాయిస్తారని నమ్ముతున్నా'అంటూ చెప్పుకొచ్చారు.

ఇక కోనసీమ వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలలో శెట్టిబలిజ సామాజిక వర్గం‌ ఓటర్లు ప్రతీ నియోజకవర్గంలోనూ సుమారుగా నలభై వేల ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇక తనకు ఎక్కడ అసెంబ్లీ సీటు కేటాయించినా తన సామాజిక వర్గం, కాపు సామాజికవర్గం కలిసి గెలుపిస్తారని, తన గెలుపు ఖాయమేనని ధీమా వ్యక్తం చేశారు. పితాని బాలకృష్ణ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తాడు. జిల్లాలో ఎక్కడో ఒకచోట నుండి పార్టీ తరపున పోటీలో ఉంటారని స్పష్టం చేశారు.

Also Read : మీరు ఇస్తారా.. మమ్మల్నే చేయమంటారా? కోస్ట్‌ గార్డ్ లో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు పై సుప్రీం సీరియస్‌!

#mummidivaram-mandal #janasena #pawan-kalyan #pithani-balakrishna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe