Pawan Kalyan: సూరప్పచెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన పవన్

AP: పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు.

Pawan Kalyan: సూరప్పచెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన పవన్
New Update

Pawan Kalyan: పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా యు.కొత్తపల్లి మండల పరిధిలోని 54 గ్రామాలకు అందిస్తున్నారు. బుధవారం ఉప్పాడ (Uppada) తీర ప్రాంత సందర్శనకు వెళ్తూ మార్గమధ్యంలో సూరప్ప చెరువును పరిశీలించారు.

ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. పిఠాపురం, నవకండ్రవాడ, వాకతిప్ప, యు.కొత్తపల్లి తదితర గ్రామాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దారి పొడుగునా ప్రజలు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలుకగా అందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు.

Also Read: డిప్యూటీ సీఎం క్రేజ్ వేరే లెవల్.. చిన్నారి అభిమానిని పలకరించిన పవన్..!

#pawan-kalyan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe