విద్యా వ్యవస్థ స్కాంలే టార్గెట్.. అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేది ఇదే..!!

జగన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని . మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని.. పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటీ..? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక ఫస్ట్ విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాంలపై విచారణ జరిపిస్తామన్నారు.

New Update
విద్యా వ్యవస్థ స్కాంలే టార్గెట్.. అధికారంలోకి వస్తే ఫస్ట్ చేసేది ఇదే..!!

Pawan Kalyan: జగన్ ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అమ్మఒడిలో స్కాం జరిగిందన్నారు. ఈటీఎస్, ఐబీ ఒప్పందాల వెనుక భారీ స్కాం ఉందనే అనుమానాలున్నయన్నారు జనసేనాని. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదని.. పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటీ..? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో జగన్ ప్రభుత్వం చేసిన స్కాంలపై విచారణ జరిపిస్తామన్నారు.

"పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా చర్యలు తీసుకోకుండా ఈ యాక్సెంట్ గొడవేంటీ..? అర్థం కావడం లేదు. మూడో తరగతి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఎందుకో అర్థం కావడం లేదు. యాక్సెంట్ కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా..? సీబీఎస్ఈ అఫిలియేషన్ సంగతి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో స్కాం జరిగినట్టు కన్పిస్తోంది. 2024లో అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో స్కాంలపైనే తొలి విచారణ. జగన్ హయాంలో విద్యా రంగంలోని స్కాంల్లోని పాత్రధారులు జైలుకెళ్తారు. స్విట్జర్లాండ్ జెనీవా కోర్టులో అర్బిట్రేషన్ చేసుకోవాలా..? ఒప్పందం జరిగాక అర్బిట్రేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహరం.గతంలో ఇలాంటి అర్బిట్రేషన్ల వల్ల భారత దౌత్య కార్యాలయాలను సీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం చేసుకున్న ఈటీఎస్, ఐబీ ఒప్పందాల మీదున్న అనుమానాలను నివృత్తి చేయాలి. సీఎం జగన్, మంత్రి బొత్స అమెరికన్ యాక్సెంట్ ఏం మాట్లాడరే. అమెరికన్ యాక్సెంటో.. బ్రియన్ యాక్సెంటో తెలియడం లేదు''.

Also Read: ఏపీలో భారీగా పెరిగిన గ్రూప్-2 జాబ్స్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు..!!

''విద్యార్థుల సంఖ్య విషయంలో.. అమ్మఒడి లబ్దిదారుల సంఖ్య విషయంలో తేడాలున్నాయి. సుమారు 5.71 లక్షల మంది విద్యార్థుల పేరుతో అమ్మ ఒడి నిధులు, విద్యా కానుక నిధులు పక్కదారి పట్టాయి. సుమారు రూ. 743 కోట్ల మేర అమ్మఒడి నిధులు పక్కదారి పట్టాయి. అమ్మఒడిలో స్కాం జరిగింది. పేద విద్యార్థుల పేరుతో దోపిడీ జరుగుతోంది. ఐబీ కరిక్యులమ్ తీసుకురావాలని ఎందుకు ఇంత ఒత్తిడి తెస్తున్నారు..? ఈ ఒప్పందాల వెనుకున్న మతలబేంటీ..? విద్యా శాఖలో మరిన్ని స్కాంలు జరిగాయి.. అవి త్వరలో బయటపెడతాం. రూ. 100 కోట్ల దాటిన ప్రతి కార్యక్రమానికి జుడిషియరీ ప్రివ్యూ ముందు పెడతామన్నారు.. ఇప్పుడెందుకు పెట్టలేదు''. అని మంత్రి బొత్సని జనసేన అధినేత ప్రశ్నించారు. మంత్రి బొత్స వ్యంగ్యం పక్కన పెట్టి అడిగిన వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు