/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ambati-Rayudu-jpg.webp)
Ambati Rayudu:ఏపీలో రానున్నఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు జనసేన అధినేత పవన కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఓటర్లను ప్రభావితం చేసేందుకు పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడును నియమించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాయుడుతో పాటు కొణిదెల నాగబాబు, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను, మొగలిరేకులు శ్రీ సాగర్, జానీ మాస్టర్ పేర్లను ప్రకటించారు. కాగా మొదట జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాయుడు.. ఆ తరువాత 10 రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చిన రాయుడు.. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
జనసేన ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు#VoteForGlasspic.twitter.com/T5HzqMURqm
— JanaSena Party (@JanaSenaParty) April 10, 2024