Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి 4వ విడత వారాహి యాత్ర

వాయిదా పడిన జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోసారి ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

New Update
Pawan Kalyan: అక్టోబర్ 1 నుంచి 4వ విడత వారాహి యాత్ర

Pawan Kalyan Varahi Yatra: వాయిదా పడిన జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మరోసారి ప్రారంభం కానుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అవనిగడ్డలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ యక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. సభా నిర్వహణకు ఏర్పాట్లను జనసేన నాయకులు ప్రారంభించారు. వారాహి వాహనంపై నుంచి సభికుల్ని ఉద్దేశించిపవన్ కల్యాణ్ ప్రసంగిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో మూడు దశలుగా పూర్తయిన వారాహి విజయ యాత్ర 4వ దశగా కృష్ణా జిల్లాలో 5 రోజులపాటు కొనసాగనుందని తెలిపారు. అవనిగడ్డలో బహిరంగ సభ అనంతరం.. మచిలీపట్నం చేరుకుని 2, 3 తేదీల్లో పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన నేతలు తెలిపారు. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశం అవుతారు. ఆ మరుసటి రోజు అంటే 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. 4వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు.

కాగా, పవన్ కల్యాణ్ సభ ఏర్పాట్లను ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కల్యాణం శివ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం అసెంబ్లీ ఇన్చార్జి బండి రామకృష్ణ తదితరులు పరిశీలించారు. అనంతరం అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కార్యాలయం వద్ద నిర్వహించారు. అక్టోబర్ 1వ తేదీన అవనిగడ్డలో జరిగే వారాహి యాత్రను విజయవంతం చేయాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి మచిలీపట్నం హైవే మీదగా రోడ్డు మార్గాన వస్తారని తెలిపారు. మచిలీపట్నం నుండి నేషనల్ హైవే మీదుగా చల్లపల్లి, మోపిదేవి, మీదగా అవనిగడ్డకు చేరుకుంటారని వివరించారు. అవనిగడ్డలో బహిరంగ సభ అనంతరం తిరిగి మచిలీపట్నం వెళ్తారని తెలిపారు. ఈ సమావేశంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్, మైలవరం ఇంచార్జ్ రామ్మోహన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Also Read:

Nara Lokesh: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ కు స్వల్ప ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు

Vishal: సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ చేసిన కామెంట్స్ వైరల్.. కేంద్ర ప్రభుత్వం సీరియస్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు